వైసీపీని భయపెడుతున్న కేఏ పాల్ ! ఎలా అంటే ?

మీడియా లో హడావుడి తప్ప ప్రజల్లో పెద్దగా బలం లేని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ బలమైన పార్టీలను భయపెట్టే రేంజ్ లో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు.అదేంటి కేఏ పాల్ ని చూసి కూడా ఓ ప్రధాన పార్టీ భయపడుతోందా అది ఎలా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.

 Ycp Scared Of Ka Paul-TeluguStop.com

ఇంతకీ విషయం ఏంటి అంటే ? కే ఏ పాల్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల పేర్ల కు దగ్గరగా పేర్లు కలిగిన నాయకులను పోటీకి నిలబెట్టాడని, తమ పార్టీకి తమ అభ్యర్థుల దెబ్బకొట్టడానికే ఈ విధంగా చేస్తున్నాడని వైసీపీ ప్రచారం చేస్తోంది.అనంతపురం జిల్లానే పరిగణలోకి తీసుకుంటే ఈ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారిని పోటీకి దించారు.

ప్రజాశాంతి పార్టీ వెనుక కూడా టీడీపీ ఉన్నట్టే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రజాశాంతి పార్టీ తరపున అనంతపురంలో నామినేషన్ వేసిన పగడి వెంకటరామిరెడ్డి టీడీపీ నాయకుడు.

ఈయన రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్న ఆలోచనతో ఈ ప్లాన్ వేశారని వైసీపీ ఆధారాలను చూపిస్తోంది.

రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి ఉండాల రామచంద్రారెడ్డి, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి కె.విశ్వనాథ్‌ రెడ్డి, అనంతపురం అనంత వెంకటరామిరెడ్డి పగడి వెంకటరామిరెడ్డి,కల్యాణదుర్గం ఉషాశ్రీ చరణ్ ఉషారాణి నేసే, రాప్తాడు తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి డి.ప్రకాశ్‌, పెనుకొండ ఎం శంకర్‌నారాయణ ఎస్.శంకర్‌నారాయణ, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి,కదిరి సిద్దారెడ్డి సన్నక సిద్దారెడ్డి.

aగుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు లో అయితే అదే పేరు ఉన్న నంబూరు శంకరరావు అనే వ్యక్తిని నిలబెట్టింది ప్రజాశాంతి పార్టీ.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే ఫార్ములాను ఉపయోగించారు.ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వ్యక్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రంగంలోకి దించారు.ఇప్పుడు అదే ఫార్ములాను వైసీపీ మీద టీడీపీ ప్రయోగిస్తోంది.ఈ పేర్ల ఫార్ములా ఎంతవరకు వర్కవుట్ అవుతోందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube