నయన్‌పై రాధారవి చేసిన వ్యాఖ్యల హీట్‌ పెరుగుతోంది.. ఇంతకు ఏమన్నాడో తెలుసా?

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ నయనతార ఈమద్య కాలంలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంది.ఈమె చేసిన చేస్తున్న సినిమాలకు మంచి ఆధరణ దక్కుతుంది.

 Nayanthara Issues Statement Against Radha Ravi Comments-TeluguStop.com

దాంతో ఈమెను లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులు పిల్చుకుంటున్నారు.అభిమానులు మరియు కొందరు సినీ వర్గాల వారు ఆమెకు పెట్టిన లేడీ సూపర్‌ స్టార్‌ పేరుపై వివాదాస్పద నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడు రాధా రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

చిన్మయి విషయంలోనే ఈయన పలు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.ఈ సమయంలోనే ఈయన నయనతారపై విమర్శలు చేయడం జరిగింది.

లేడీ సూపర్‌ స్టార్‌ అనే బిరుధుకు నయనతార అర్హురాలు కాదని, ఆమెకు అసలు అంతటి గౌరవం ఇవ్వనక్కర్లేదు అని, బికినీలు వేసుకునే అమ్మాయి సూపర్‌ స్టార్‌ ఎలా అవుతుంది అంటూ ఆరోపణలు చేశాడు.రాధా రవి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.

పెద్ద ఎత్తున జనాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.రాధారవి వ్యాఖ్యలను ప్రముఖులు సైతం తప్పుబడుతున్నారు.

తాజాగా తనపై రాధారవి చేసిన వ్యాఖ్యలపై నయన్‌ స్పందించింది.ఆయన సమాధానం చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేసింది.

వివాదం ముదురుతున్న నేపథ్యంలో రాధారవి క్షమాపణలు చెప్పాడు.నేను అన్న మాటలకు మీరు బాధపడ్డట్లయితే నేను క్షమాపణలు చెబుతున్నాను.దయచేసి నన్ను క్షమించండి అంటూ రాధారవి పేర్కొన్నాడు.అయినా కూడా వివాదం చల్లారడం లేదు.తాజాగా తెలుగు హీరో రానా మాట్లాడుతూ మీరు చేసిన వ్యాఖ్యలు దారుణం.మీరు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది.

మీరు ప్రతి సారి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇతరులు బాధపడుతున్నారు అనే విషయాన్ని గుర్తించడం లేదు.ఇలా చేయడం వల్ల మీ స్థాయిని మీరు తగ్గించుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube