జగన్ పైనే పవన్ విమర్శలు ! వ్యూహం ఏంటి ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఇటు ప్రజల్లోనూ పార్టీల్లోనూ ఇదే రకమైన చర్చ నడుస్తోంది.

 Pawan Kalyan Comments On Ys Jagan Reddy-TeluguStop.com

పవన్ టీడీపీకి మేలు చేయడానికి ఈ విధంగా చేస్తున్నారని మరికొంతమంది సందేహ పడుతున్నారు.అయితే పవన్ విమర్శల వెనుక వ్యూహం ఏంటి అనేది ఎవరికి అంతుపట్టడంలేదు .వైసీపీని దెబ్బ కొట్టేందు కే వామపక్ష పార్టీలు తోనూ బీఎస్పీ తోనే పొత్తు పెట్టుకుని వైసీపీకి వెళ్లాల్సిన ఓట్లను చీల్చి టీడీపీకి మేలు చేసేందుకు పవన్ ఇలా చేస్తున్నాడని మరికొంతమంది సందేహ పడుతున్నారు.కానీ పవన్ అంతరంగం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు.

వైసిపి జనసేన మధ్య గతంలో లో పొత్తు కు సంబంధించి సంప్రదింపులు నడవడం అది బెడిసికొట్టడం జరిగినట్టు ప్రచారం జరిగింది.

పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న తరుణంలో పవన్ ఈ స్టాండ్ తీసుకోవడం ఎవరికీ అంతుచిక్కడంలేదు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రతి సభలోనూ జగన్‌పై తీవ్ర భాషలో విరుచుకుపడుతూ వచ్చారు.సవాళ్లు విసిరారు.

పాదయాత్రలో ఉన్న జగన్ కూడా ఈ విధంగానే పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించి సంచలనం రేపారు.ఆ తరువాత ఇరు పార్టీలు ఈ సంగతి మర్చిపోయాయి.

పాతికేళ్ల రాజకీయం చేస్తానని అంటున్న పవన్‌ ప్రస్తుత ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయంగా తననే చూపించాలనుకుంటున్నారు.ఎన్నికల సమరం టీడీపీ వర్సెస్‌ వైసీపీ చంద్రబాబు వర్సెస్‌ జగన్‌ అన్న చర్చకే పరిమితమైపోతే జనసేన ఉనికికి అర్థమేలేదన్నది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.

జగన్ కు సొంత మీడియా తో పాటు ఇటీవల టిఆర్‌ఎస్‌ పార్టీతో స్నేహం కారణంగా కొన్నిమీడియా సంస్థలు జగన్‌కు బాగా ప్రచారం కల్పిస్తూ జనసేన ను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి.ఇది పవన్ కు అస్సలు నచ్చడంలేదు.చంద్రబాబు వ్యతిరేక వర్గాలన్నిటికి జగనే సమీకరణ బిందువు కాకుండా చూడాలని అనుకుంటున్న పవన్ ఈ ఎన్నికల్లో చర్చ మొత్తం జగన్‌ వర్సెస్‌ పవన్‌ అన్నట్టు మార్చితే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది.అందుకే వైసీపీ మీదే ఎక్కువ టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube