170 సార్లు ఎన్నికలలో పోటీ , ఒక్కసారి కూడా గెలవలేదు .. అసలు ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా?

రాజకీయాల్లో పోటీకి నిలబడి ఓటమి పాలైతే చాలా కుంగిపోతారు , అదే రెండు మూడు సార్లు పరాభవం చెందితే కొంతమంది మానసిక వ్యదకి లోనవుతారు అలాంటింది ఒక వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు 170 సార్లు ఎన్నికలలో నిల్చొని ఒక్క సారి కూడా గెలవలేదు.అందరూ ఎన్నికల్లో పోటీ చేసేది గెలుపు కోసం , గెలిచి అధికారాన్ని చేజికిచ్చుకొని ప్రజా సేవ చేయాలనుకుంటారు.

 Election King Padmarajan Files Nomination For The 200th Time-TeluguStop.com

కాని ఈయన మాత్రం పోటీకి నిల్చొని గెలవకూడదు అని దేవునికి మొక్కుతాడు.ఈ వ్యక్తి కేవలం నామినేషన్ల కోసమే ఇప్పటివరకు ఎంత ఖర్చుపెట్టాడో తెలుసా? ఏకంగా రూ.20 లక్షలకుపైనే.అయినా.

ఎన్నికల్లో పోటీచేయాలన్న ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గలేదు.ఈసారీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అతడే తమిళనాడుకు చెందిన డాక్టర్ కే పద్మరాజన్.

అసలు కథ ఇది

పద్మరాజన్ వయసు 60 ఏళ్లు , ఈయనని ముద్దుగా ఎలక్షన్ కింగ్ అని పిలుస్తుంటారు, ఇతను తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు మండలం మెట్టూరు డ్యామ్ గ్రామస్తుడు.

పద్మరాజన్ పెద్దగా చదువుకోలేదు , 8 తరగతి వరకు చదివి ఆ తరువాత చదువు మానేశాడు, ఈయన వృత్తిరిత్యా ఆయుర్వేద వైద్యుడు , తన ఊరిలో చిన్న వ్యాపారం కూడా చేస్తాడు.పద్మరాజన్ మొట్టమొదటిసారిగా 1988లో జరిగిన ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు.

మెట్టూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు.అప్పటి నుంచి ఇప్పటివరకు 170 ఎన్నికల్లో పోటీచేశారు.

చివరగా 2015లో కేరళలోని అరువిక్కర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీచేశారు.ఒకసారి తన స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుంటే ఎన్నికల అంశం వచ్చింది దానితో అతని స్నేహితులు అధికారం, హోదా ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో నిలబడతారు అని పద్మరాజన్‌తో అన్నారట.

అదే మాట ఆయనను ఎన్నికలలో పోటీ చేసే వైపు నడిపింది.ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నిరూపించేందుకే తాను వరుసగా బరిలోకి దిగుతున్నానని గర్వంగా చెప్పుకుంటారు.

పద్మరాజన్ ఎక్కువగా ముఖ్యమంత్రులు , ప్రధాన మంత్రులు వంటి ప్రముఖుల పై పోటీ చేస్తారు అదే ఆయన స్టైల్.మాజీ రాష్ట్రపతులు అబ్దుల్‌కలాం, ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, ఆర్కే నారాయణన్, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్ పాయ్, మన్మోహన్ సింగ్, మాజీ సీఎంలు కరుణానిధి, జయలలిత వంటివారిపై పోటీకి నిలబడ్డారు.

ఈయన ఇప్పటివరకు 8సార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో , 28సార్లు లోక్‌సభ, 35సార్లు రాజ్యసభ, 51సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు.మిగితావి స్థానిక సంస్థల ఎన్నికలు.పద్మరాజన్ తన 174 ఎన్నికలలో నలుగురు ప్రధానమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 13 మంది కేంద్రమంత్రులు, 15 మంది రాష్ట్ర మంత్రులపై పోటీచేశారు.ఇందులో మూడుసార్లు తమిళనాడు మాజీ సీఎం జయలలితపైనే పోటీ చేయడం విశేషం.

ఇన్ని సార్లు పోటీ చేసిన పద్మరాజన్ కి ఇప్పటివరకు ఒక ఎన్నికలో వచ్చిన అత్యధిక ఓట్లు 6273 .ఈయన నామినేషన్ కోసం చెల్లించే డిపాజిట్ కోసమే 20 లక్షల వరకు ఖర్చు చేశారు.పద్మరాజన్ అత్యధికంగా 174 సార్లు ఎన్నికలలో నిల్చున్నందుకు ఆయన పేరు గిన్నిస్ రికార్డ్లకి ఎక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube