కొత్త తరహా గేమ్‌, గెలిచిన వారికి లక్షల్లో ప్రైజ్‌ మనీ... మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయవద్దు

మనం కొట్టుకునే ఆటలను చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం.రెజ్లింగ్‌, డబ్ల్యూ డబ్ల్యూ వంటి గేమ్స్‌ను జనాలు తెగ ఎంజాయ్‌ చేస్తారు.

 Russian Man Slapping Championship Sees Contestant Knocked Out-TeluguStop.com

రింగ్‌లో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే కోట్లాది మంది చూడటం జరుగుతుంది.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన వారికి బహుమానాలు లక్షలు, కోట్లల్లో ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే సిల్లీగా చెంపదెబ్బల గేమ్‌ కూడా ఒకటి ప్రారంభం అయ్యింది.ఈ గేమ్‌ను కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు.

ఈ చెంపదెబ్బల గేమ్‌ లో మూడు రౌండ్లు ఉంటాయి.మూడు రౌండ్స్‌లో ఎవరు ప్రత్యర్థిని మట్టి కరిపిస్తారో వారే విన్నర్‌.

ఈ చెంపదెబ్బల గేమ్‌ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న పోటీ తత్వం, ఇంకా కొత్త పోకడలు వీటన్నింటి నడుమ స్లాపింగ్‌ గేమ్‌ మొదలు అయ్యింది.మొదట సరదాగా మొదలు అయిన ఈ గేమ్‌ ప్రస్తుతం దేశాల మద్య జరుగుతోంది.

ఈ గేమ్‌లో భాగంగా కండల వీరుళ్లు తమ ప్రత్యర్థులను చెంప దెబ్బలు కొడతారు.మూడు చెంప దెబ్బల్లో అవతలి వ్యక్తిని కింద పడేలా చేయడంతో పాటు, అవతలి ప్రత్యేర్థి కొట్టే చెంప దెబ్బలకు కింద పడకుండా ఉండాలి.

ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఈ చెంప దెబ్బల గేమ్స్‌ పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.ఈ గేమ్‌ ఆడేందుకు పెద్ద సంఖ్యలో బాడీ బిల్డర్స్‌ ముందుకు వస్తున్నారు.

ఈ చెంప దెబ్బల గేమ్‌లో ఒక రిఫరీ ఉంటాడు.ఆ రిఫరీ ఒకరి ముందు ఒకరిని నిల్చో బెట్టి పక్కన ఉంటాడు.టాస్‌ వేసి మొదట ఎవరు కొట్టాలనే విషయంపై వారికి క్లారిటీ ఇస్తాడు.ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చొప్పున మూడు మూడు చెంప దెబ్బలు కొట్టుకుంటారు.

మూడు చెంప దెబ్బల్లో కొందరు మొదటి చెంప దెబ్బకు పడితే మరి కొందరు రెండు లేదా మూడవ చెంప దెబ్బకు పడతారు.అలా ఎవరైతే కింద పడిపోతారో వారు ఓడిపోయినట్లు.

గెలిచిన వ్యక్తికి లక్షల్లో ప్రైజ్‌ మనీ ఉంటుంది.

ఇది చాలా ప్రమాదకరమైన ఆట.ఈ ఆట సందర్బంగా ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే అవకాశం ఉంది.చెంప దెబ్బ తిన్న వ్యక్తి అవతలి వ్యక్తిని పిడికిలితో చెంపపై గుద్దితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే పిడి గుద్దులు గుద్దితే ఆ వ్యక్తి డిస్‌ క్వాలిఫై అవ్వడంతో పాటు అవతలి వ్యక్తి గెలిచినట్లుగా ప్రకటిస్తారు.ఈ కొత్త గేమ్‌ ప్రస్తుతానికి అయితే ఇండియాలో లేదు.

ముందు ముందు ఇండియాలో కూడా వస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube