జనసేనాని కాదు పక్కా పొలిటీషియన్..ఎందుకంటే..???

రాజకీయ నేతలకి స్వార్ధం పేరుకు పోయింది అందుకే రాజకీయాలు అంటే అందరూ భయపడుతున్నారు.యువత రాజకీయాలవైపు అడుగులు వేయకపోవడానికి అసలుకారణం ప్రస్తుత రాజకీయ పరిస్థితులే.

 Pawan Kalyan Pakka Politician-TeluguStop.com

నిస్వార్ధంగా రాజకీయాలు చేసే సుపరిపాలన రావాలి, ఆదిశగా జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఎవరూ ఊహించని రీతిలో రాజకీయ గతిని మార్చేస్తా, అది చేస్తా , ఇది చేస్తా అంటూ రైటర్ రాసిన దైలాగులని బట్టీ పట్టి ఒక్క అక్షరం పొల్లు పోకుండా చెప్పడం కేవలం జనసేనానికి మాత్రమే సాధ్యం అంటున్నారు.

ఎందుకంటే ఎన్నో సెంటిమెంట్ డైలాగులని సినిమాలలో పండించిన పవన్ కళ్యాణ్ కి ఈ డైలాగులని అప్పచెప్పడం పెద్ద విషయమేమీ కాదులెండి అంటూ నవ్విపోతున్నారు.అదేంటి పవన్ కళ్యాణ్ చాలా నీట్ అండ్ క్లీన్ గా రాజకీయాలు చేస్తున్నారు కదా అలా అంటారు ఏంటి అనుకుంటున్నారా.

సరే ఒక్క సారి తాజా రాజకీయ పరిస్థితులని వారం పదిరోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తే పవన్ జనసేనాని కాదు.పక్కా పొలిటీషియన్ అనక మానరు.

చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కలిసారా లేదా ఎన్నికలు అయ్యాక కలుస్తారా అనేది పక్కన పెడితే.చంద్రబాబు రాజకీయం మాత్రం పవన్ కళ్యాణ్ వంటపట్టించుకున్నారు.ఒక రకంగా చెప్పాలంటే పవన్ రాజకీయం తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే విధంగా తయారయ్యింది.తెలంగాణా ఎన్నికల ముందు తెలంగాణా సీఎం కేసీఆర్ ని కలిసి బాసు మీరు సూపర్ అన్నాడు పవన్ కళ్యాణ్.

ఇప్పుడేమో కేసీఆర్ పై చిందులు తొక్కుతున్నాడు.సరే ఇలాంటివి రాజకీయాల్లో సహజమే ,పార్టీ పెట్టాడు కాబట్టి ఇలాంటి భజనలు విమర్శలు తప్పవు.

కానీ.

అన్నదమ్ములా కలిసి ఉంటున్నరెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఎందుకు పవన్ చిచ్చు పెడుతున్నాడు.

గొడవలు రేగేవిధంగా, తెలంగాణాలో ఉన్న ఆంధ్రా వాళ్ళపై దాడులు చేసే విధంగా ఎందుకు తెలంగాణా వాసులని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు.?? కేసీఆర్ అంటే ఏపీలో ఎంతో మంది అభిమానిస్తారు.అంతెందుకు కేసీఆర్ పాలన సహబాష్, పధకాలు సూపర్ అన్న సమయం నుంచీ పవన్ అభిమానులు సైతం కేసీఆర్ ని అభిమానించారు.ఇప్పుడు ఎందుకు జగన్ ని కేసీఆర్ ని కలిపి చూపించి గొడవలు రేపే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.అంటే అందుకు కారణం ఒక్కటే

తెలంగాణలో ఉంటున్న ఆంధ్రా ప్రజలు ఏమయినా పరవాలేదు, రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగి కొట్టుకు చచ్చినా పవరవాలేదు,కానీ జగన్ అధికారంలోకి రాకూడదు, చంద్రబాబు ని మరోసారి సీయం సీటుపై కూర్చోపెట్టాలి ఇదే పవన్ ముందు ఉన్న ఏకైన టార్గెట్ గా ఉందని రాజకీయ విమర్శకులు విశ్లేషిస్తున్నారు.పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చెడ్డీలు వేసుకునే చిన్న పిల్లాడికి కూడా పవన్ ఓ పక్కా పొలిటీషియన్ లా వ్యవహరిస్తున్నాడని అర్థం అవుతుందని అంటున్నారు.

పవన్ ఇలాంటి స్వార్ధ రాజకీయాలు చేస్తూ తానొక నిజాయితీ గల వ్యక్తిగా చెప్పుకోవడం, అధికారంలో ఉన్న చంద్రబాబు ని వదిలి కొన్నేళ్లుగా అధికాలంలో లేకపోయినా జగన్ పై విమర్సలు చేయడం దేనికి సంకేతమో చెప్పాలని అంటున్నారు వైసీపీ నేతలు.ఏది ఏమైనా సరే పవన్ ఈ తరహా వ్యవహారంతో సొంత పార్టీనే కష్టాలలోకి నెట్టుకున్తున్నాడు అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube