రిటర్న్ గిఫ్ట్ విషయంలో కేసీఆర్ వెనకడుగు వేసినట్టేనా ?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ రాజకీయాల మీద మొన్నటి వరకు ఫుల్ ఫోకస్ పెట్టాడు.తెలంగాణ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేసాడు.

 Kcr Back Step On Return Gift-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసి మరీ ఎన్నికల్లో ప్రచారం చేసినా బాబు ఎత్తులు వర్కవుట్ అవ్వలేదు.మహాకూటమి మహా ఘోరంగా ఓటమి చెందింది.

అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ బహిరంగంగా చెప్పాడు.ఇక అప్పటి నుంచి ఏపీ రాజకీయాల మీదే ఫోకస్ అంతా పెట్టి బాబు ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాడు.

అంతే కాదు బాబుని దెబ్బకొట్టడానికి జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు.

కోడి కొత్తి కేసు దగ్గర నుంచి డాటా చోరీ వివాదం వరకు ఆంధ్రా పోలీసులను న‌మ్మేది లేద‌ని జ‌గ‌న్ అనడం దానికి అనుగుణంగా తెలంగాణ కేంద్రంగానే కేసుల నమోదు అవ్వడం ఈ క్ర‌మంలో ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ జోక్యం ఎక్కువ అయ్యింది అనే భావన అందరిలోనూ కలిగింది.

కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినదగ్గర నుంచి కేసీఆర్ ఏపీ రాజకీయ ల గురించి పెద్దగా మాట్లాడలేకపోవడం అనేక సందేహాలు కలిగిస్తోంది.ఆయనొక్కడే కాదు టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ కూడా ఏపీ రాజకీయాలపై తరుచూ స్పందించడం కుల నాయకులతో సంప్రదింపులు చేస్తూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు!

ఇదే సమయంలో టీడీపీ కూడా వైసీపీ , టీఆర్ఎస్ పార్టీల మీద విమర్శల బాణాలు వదులుతోంది.జ‌గ‌న్ ఫ్యాన్ తిర‌గాలంటే, కేసీఆర్ స్విచ్ ఆన్ చెయ్యాల‌ని, ఢిల్లీ నుంచి మోడీ క‌రెంటు స‌ప్లై ఇవ్వాలంటూ బాబు మీద తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.ఏపీలో వైసీపీ అభ్య‌ర్థులు గెలిస్తే కేసీఆర్ గెలిచిన‌ట్టేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా విమర్శలు చేస్తున్నా టీఆర్ఎస్ స్పందించడం లేదు.కేసీఆర్ ఒక్కసారిగా ఇలా ఎందుకు వెనకడుగు వేసారో చాలామందికి అర్ధం కావడంలేదు.

మరికొందరు మాత్రం తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బాబు మీద ఫోకస్ పెడితే తెలంగాణాలో బాబు సామజిక సామజిక వర్గం వారి ఓట్లకు గండిపడుతుందేమో అన్న ఆందోళన కూడా కేసీఆర్ లో ఉందని మరికొందరు వాదిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube