ఐపీఎల్ లో సురేష్ రైనా , పార్థివ్ పటేల్ అందుకున్న అరుదైన రికార్డ్ లు ఇవే .. ఆ రికార్డులు ఏంటో చూడండి..

ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఎప్పుడు ఉత్కంఠ భరితంగా ఉంటుంది కానీ సీజన్ 12 తొలి మ్యాచ్ మాత్రం పరమ బోరింగ్ గా ఉంది అంటూ సోషల్ మీడియా లో ఐపీఎల్ అభిమానులు ట్రోల్స్ ప్రారంభించారు దానికి కారణం బెంగళూర్ 70 పరుగులకే అలౌట్ అవ్వడం.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని దానికి తగ్గట్టుగానే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు , ముఖ్యంగా భారత సీనియర్ ఆటగాడు హర్భజన్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు.

 Suresh Raina And Parthiv Patel Rare Records In Ipl Matches-TeluguStop.com

హర్భజన్ కి తోడుగా తహిర్ కూడా రెచ్చిపోవడం తో బెంగళూర్ 70 పరుగులకే కుప్పకూలింది.పార్థివ్ పటేల్ తప్ప మరెవరూ రెండంకెల స్కోర్ చేయలేదు , చెన్నై సూపర్ కింగ్స్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి గెలుపుతో ఐపీఎల్ ని ఆరంభించింది.

సురేష్ రైనా పరుగుల రికార్డ్

భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనత సాధించాడు.ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.ఈ మ్యాచ్‌కు ముందు 4985 పరుగులతో ఉన్న రైనా.19 పరుగులు చేసి 5 వేల క్లబ్బులోకి అడుగుపెట్టాడు.ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అతనే కొనసాగుతున్నాడు.కోహ్లి (4954) అతడికి చేరువలో, రెండో స్థానంలో ఉన్నాడు.కోహ్లీ కి ముందుగా ఈ అవకాశం వచ్చింది.బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేయడం వల్ల అతను మరో 46 పరుగు లు చేసి ఉంటే ఐపీఎల్ లో 5000 పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచేవాడు.

ఐపీఎల్ లో మొదటగా 1000 నుండి 5000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.

మొదటగా ఐపీఎల్ లో 1000 పరుగులు చేసిన ఆటగాడు – ఆడమ్ గిల్ క్రిస్ట్

మొదటగా ఐపీఎల్ లో 2000 పరుగులు చేసిన ఆటగాడు – సురేష్ రైనా

మొదటగా ఐపీఎల్ లో 3000 పరుగులు చేసిన ఆటగాడు – సురేష్ రైనా

మొదటగా ఐపీఎల్ లో 4000 పరుగులు చేసిన ఆటగాడు – విరాట్ కోహ్లీ

మొదటగా ఐపీఎల్ లో 5000 పరుగులు చేసిన ఆటగాడు – సురేష్ రైనా

పార్థివ్ పటేల్ అరుదైన ఐపీఎల్ రికార్డ్

బెంగళూర్ వికెట్ కీపర్ , ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పార్థివ్ పటేల్ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు , ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్ అది.ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా వచ్చిన పార్థివ్ బెంగళూర్ జట్టు 10 వ వికెట్ గా ఔట్ అయ్యాడు.ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ లలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తో ప్రారంభించి చివరి వికెట్ ఆటగాడి తో ఆడిన తొలి ఆటగాడు పార్థివ్ పటేల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube