అతడు ఒక బస్సు కండక్టర్ కానీ మూడు లక్షల చెట్లు నాటాడు , అతని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..

రానున్న కాలంలో పర్యావరణం మరింత కాలుష్యం అవ్వబోతుంది అందుకే మనం ఎంత వీలైతే అన్ని మొక్కలు నాటుదాం అని అందరికి సలహా ఇస్తాం కానీ మనం మాత్రం మొక్కల్ని నాటం , ఏదో పుట్టిన రోజునాడో , ప్రేయసి పుట్టిన రోజునో ఒక్క మొక్కనాటి ఫోటో దిగి సోషల్ మీడియా లో షేర్ చేస్తాం కానీ తరువాత మనం ఆ మొక్క గురించి మరిచిపోతాం.ఇలాంటి సమాజం లో కూడా ఒక సామాన్య బస్సు కండక్టర్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లక్షల ( 3 లక్షల ) మొక్కలు నాటి పర్యావరణానికి తన వంతు కృషి చేస్తున్నారు , ఆయన చేస్తున్న ఈ పనికి ప్రభుత్వం నుండి కూడా మంచి ప్రశంస లు వచ్చాయి.

 Coimbatore Bus Conductor Has Planted 3 Lakh Trees Using His Own Income-TeluguStop.com

అతని కథ ఇదే.

తమిళనాడు కి చెందిన బస్సు కండక్టర్ ఏం.యోగినాథ్ ఇతను ప్రస్తుతం కోయంబత్తూరు లో నివాసిస్తున్నాడు.25 ఏళ్ల క్రితం అతను కండక్టర్ గా చేరాడు.అప్పటి నుండి ప్రతి రోజు బస్సులో ప్రయాణించేవాడు.ప్రయాణించే మార్గం లో రోడ్డు కి ఇరువైపులా చెట్లను నరికేసే వాళ్ళు , అది చూసిన యోగి ఇప్పుడే ఇంత కాలుష్యం ఉంటే చెట్లని ఇలా నరికేస్తూ పోతే రాబోయే కాలం లో మన పర్యవరణం మరింత కాలుష్యం కావచ్చు అనుకున్నాడు.

అప్పుడే అతనికి మొక్కలు నాటలన్న ఆలోచన వచ్చింది, అప్పటి నుండి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు.బస్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే, ఖాళీ సమయాల్లో తమిళనాడులోని 32 జిల్లాలు పర్యటించి ఇప్పటికే 3 లక్షలకు పైగా మొక్కలు నాటాడు.

స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలకు వెళ్లి.స్టూడెంట్స్‌కి మొక్కలు నాటడంవల్ల కలిగే లాభాల గురించి అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాడు.ఇప్పటివరకు ఆయన నాటిన మొక్కల ఖర్చు మొత్తం తన సాలరీ నుండే ఖర్చు చేశారు.

పర్యావరణ పరిరక్షణ కోసం అతను చేస్తున్న అభినందనీయం మరియు స్పూర్తిదాయకం.అతని జీవత చరిత్రను అన్ని స్కూళ్ల పాఠ్య పుస్తకాలలో ప్రచురిస్తున్నాం అని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.రాబోయే తరాలకు ఎం.యోగనాథన్ ఆదర్శంగా నిలుస్తాడని అధికారులు స్పష్టం చేశారు.

మొక్కలు నాటే పని కారణంగా యోగానాథన్ 40 సార్లు ఉద్యోగంలో బదిలీ చేయబడ్డాడు.

తన వ్యక్తిగత కారణాలు చెప్పి సెలవు తీసుకొని మొక్కలు నాటేవాడు.ఆయన చేసిన కృషికి గత మూడు దశాబ్దాలుగా ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి.

పర్యావరణ వారసుల అవార్డు, పర్యావరణ శాఖ అవార్డు, CNN-IBN రియల్ హీరోస్ అవార్డు మరియు పెరియార్ అవార్డులతో అతన్ని సత్కరించారు.

చెట్లని నరికేసే ఆ ప్రదేశం లో ఇళ్ళు కట్టుకుంటున్న జనాలు మనకి ఆక్సిజన్ అందించే చెట్లను నాటడం మరిచారు , అటువంటి ఎందరికి స్ఫూర్తి ఎం.యోగినాథ్ గారు.ఈయన తన చివరి శ్వాశ వరకు మొక్కలు నటుతూనే ఉంటా అని చెప్పడం ఆయన కి పర్యవరణం మీద ఉన్న ప్రేమను చాటి చెప్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube