యంగ్ హీరో నితిన్ సినిమా అదిగో ఇదిగో అంటూ ఆరు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.వెంకీ కుడుముల దరక్షకత్వంలో భీష్మ అనే సినిమాను చేయాలని అప్పుడే నిర్ణయించారు.
కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది.దాంతో సినిమా అసలు ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి సినిమా ప్రారంభం విషయంలో నితిన్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు.
మరో వైపు రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా అంటూ వార్తలు వచ్చాయి.అయితే సినిమా విషయంలో నితిన్ స్పందిస్తూ నేను ఏదైనా సినిమా గురించి చెబితేనే నమ్మండి.వేరే వారు ప్రకటిస్తే దాన్ని నమ్మకండి అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.
నితిన్ సినిమా కు ఒకే చెప్పి ఇప్పుడు సినిమా పారితోషికం విషయంలో తేడా కొట్టడంతో సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు అని, ఆ విషయం దర్శకుడికి తెలియక ప్రకటన చేసాడు అంటూ ప్రచారం జరుగుతోంది.నితిన్ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగానే ఇలాంటి వార్తలు, పుకార్లు వస్తాయి.
అందుకు త్వరగా సినిమాను మొదలు పెట్టమని సలహా వినిపిస్తుంది.