వేసవిలో అతి శృంగారం ఏమాత్రం శ్రేయష్కరం కాదట... ఎందుకో తెలుసా?

వేసవి కాలంలో చాలా పనులు వాయిదా వేస్తూ వస్తాం, లేదంటే ఉదయాన్నే లేదంటే సాయంత్రం సమయంలో ఆ పనులు చేసేందుకు ఆసక్తి చూపిస్తాం.మిట్ట మద్యాహ్నం సమయంలో అసలు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించం.

 How Summer Affects Your Srungaram Life According To Science-TeluguStop.com

ఎందుకంటే బయటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా పనికి దూరంగా ఉండటం బెటర్‌ అనుకుంటాం.ముఖ్యంగా బైక్‌ పై వెళ్లడం లేదంటే ఎండలో నిల్చుని చేసే పని లాంటి వాటికి పూర్తి దూరంగా ఉంటాం.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఒంట్లోని నీరు శాతం చాలా వరకు తగ్గుతుంది.అలా నీరు తగ్గడం వల్ల చాలా త్వరగా అలసి పోవడం జరుగుతుంది.

ఎండలో ఎక్కువ పని చేసే వారు శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని నష్టాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.పెద్ద ఎత్తున శరీరం నుండి నీరు వెళ్లి పోవడం వల్ల చాలా అలసి పోతారు.

నీరు తాగినా కూడా బయటకు మళ్లీ జీవం వచ్చినట్లుగా అనిపించినా కూడా లోన శరీర భాగాలు మాత్రం వెంటనే నీటిని అందుకోలేవు.ఆ సమయంలో శృంగారం చేయడం వల్ల ఆ శరీర భాగాలు మరింత ఒత్తిడికి లోనవుతాయి.

అలా లోను అవ్వడం వల్ల తీవ్ర అనారోగ్యం ఏర్పడే అవకాశం కూడా ఉంది.అందుకే వేసవి కాలంలో శృంగారంకు దూరంగా ఉండటం బెటర్‌ అనేది నిపుణుల సలహాలు.

ఈ సలహా కేవలం ఎండలో తిరిగే వారికే అని, వారు మాత్రమే శృంగారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఖచ్చితంగా ఎండలో తిరిగే వారు వారంలో ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువగా శృంగారం చేయక పోవడం మంచిది అని అంటున్నారు.అసలు శృంగార సమయంలో పరుషుడు చాలా ఎనర్జిని వినియోగిస్తూ ఉంటారు.అలాంటి సమయంలో లో ఎనర్జి లెవల్స్‌ ఉంటే మనిషి కోమాలోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఈ పరిస్థితి నుండి తేరుకునేందుకు వెంటనే నిమ్మరసం లేదా ఏదైనా పళ్ల రసం తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.శృంగారం ముందు లేదా తర్వాత నిమ్మరసం తాగినా చాలా వరకు పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అంటున్నారు.

వేసవిలో అతి శృంగారం ఏమాత్రం శ్రేయష్కరం కాదట… ఎందుకో తెలుసా? -

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube