ఆ ఎనర్జీ డ్రింక్‌తో ఒక పురుషుడికి ఆరు గంటల పాటు అంగ స్థంభన... వయగ్రా ఉన్న ఆ డ్రింగ్‌పై నిషేదం

మామూలుగా శృంగార సామర్థ్యం తక్కువ ఉన్న వ్యక్తులు అంగ స్థంభన కోసం వయాగ్రా వాడుతూ ఉంటారు.అది కూడా అయిదు పదుల వయసు దాటిన వారు వయాగ్రాను అధికంగా వాడుతారు అనే విషయం అందరికి తెల్సిందే.

 Energy Drink Called Natural Power High Energy Drink Is Banned-TeluguStop.com

అయితే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి వయాగ్రాను సరఫరా చేయాలనుకుందో ఏమో కాని ఒక సంస్థ తాము తయారు చేసే ఎనర్జి డ్రింక్‌ లో వయాగ్రాను కలిపింది.ఎనర్జి రావాలనే ఉద్దేశ్యంతో వయాగ్రా కలపడంతో చాలా ఇబ్బందులు మొదలు అయ్యాయి.

కొందరు అవసరం లేకుండానే అంగ స్థభంన జరగడం, దాని వల్ల తెగ ఇబ్బంది పడటం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఆఫ్రికా దేశాలు అయిన ఉగాండ, మలవి, జింబాబ్వే వంటి దేశాల్లో పవర్‌ నేచురల్‌ అనే ఎనర్జి డ్రింక్‌ అమ్ముడు అవుతుంది.

ఆ డ్రింక్‌ అమ్మకాలు అక్కడ భారీగా ఉంటున్నాయి.అయితే ఆ డ్రింక్‌ తాగిన వారిలో కొందరు ఈమద్య కాలంలో తీవ్ర అంగ స్థంభన సమస్యను ఎదుర్కొన్నారు.అంగం స్థభించకుంటే సమస్య, కాని అతి ఎక్కువ సమయం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గంటల పాటు అంగం స్థంభించి ఉన్న కారణంగా ఆ వ్యక్తులు తీవ్ర ఇబ్బందికి గురి అయ్యారు.చివరకు కొందరు హాస్పిటల్‌లో కూడా జాయిన్‌ అయ్యారు.

ఎనర్జి డ్రింక్‌లో మొదటి నుండి కూడా వయాగ్రా కలుపుతున్నారని, అయితే ఇటీవల వారు తయారు చేసిన కొత్త డ్రింక్‌లో వయాగ్రా శాతం ఎక్కువ అయ్యిందని రిపోర్ట్‌లో వెళ్లడయ్యింది.దాంతో పలు దేశాలు ఆ డ్రింక్‌ను బ్యాన్‌ చేశాయి.సదరు కంపెనీని పూర్తిగా మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.డ్రింక్‌లో వయాగ్రా కలపడం అనేది చాలా హేయమైన చర్య అని, అలాంటి పనికి సిద్ద పడ్డ సదరు కంపెనీపై కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

అదే డ్రింక్‌కు ఎక్కువ కాలం తాగితే మనిషి మరణించే అవకాశం కూడా ఉందని వైధ్య నిపుణులు చెబుతున్నారు.అందుకే దాన్ని బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube