ఆ జాలరి వల వేస్తే 700 కోట్లు దొరికాయి .. అసలు కథ ఇదే....

అదృష్టం ఎప్పుడు ఎటు నుండి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు.కష్టాన్ని నమ్ముకున్నోడికి అదృష్టం అవసరం లేదు కానీ ఆ కష్టానికి అదృష్టం కూడా తోడైతే ఎలా ఉంటుంది.

 Philippine Fisherman Found Worlds Largest Pearl Worth Rupees 700 Crore-TeluguStop.com

అలా తన కష్టానికి అదృష్టం తోడై ఫిలిప్పీన్స్ లో ఒక జాలరి కోటీశ్వరుడిగా మారాడు.అతని కథేంటో తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలియదు .కొంతమందికి యువకులుగా ఉన్నపుడే అదృష్టం వరిస్తుంది , మరికొంత మందికి వారి జీవిత చివరి రోజుల్లో వారి కష్టానికి అదృష్టం తోడై సంతోషంగా జీవిస్తారు.మరికొందరికి వారు చేసుకున్న కర్మలను బట్టి అదృష్టం వరించినా దాన్ని గుర్తించలేక జీవితం అంతా ఎన్నో కష్టాలు పడుతూ జీవిస్తారు.ఈ కోవకు చెందిన వాడే ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఈ జాలరి.

అసలు కథ ఇదే

ఫిలిప్పీన్స్ దేశంలోని ఒక గ్రామంలో ఈ జాలరి కుటుంబం నివసిస్తుంది.ఈయనకు ఇద్దరు పిల్లలు.ప్రతిరోజు సముద్రానికి వెళ్లి చేపలు పట్టుకొని ఆ చేపలను మార్కెట్లో అమ్ముకుంటూ తన కుటుంబాన్నిపోషించేవాడు.ఎప్పటిలాగే ఒక రోజు చేపలు పట్టే వల తీసుకొని బోటులో సముద్రంలోకి వెళ్లాడు.

చేపల కోసం వల వేసిన ఆ జాలరికి చేపలతో పాటు తెల్లగా మెరుస్తున్న దాదాపు 40 కిలోల పెద్ద రాయి తన వలలో పడింది.అది గమనించిన ఆ జాలరి ఆ రాయి ఏదో భలే మెరుస్తుందే అనుకుంటూ కొంచం బరువు ఎక్కువైనా ఆ రాయిని ఇంటికి తీసుకు వెళ్లి వారి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపించేలా గుమ్మానికి ఎదురుగా ఉన్న హాలులో అందంగా అమర్చాడు.

దాన్ని చూసిన ఇరుగుపొరుగువారు చాలా బాగుందంటూ ఆ జాలరిని మెచ్చుకునేవారు.ఈ రాయి మీ ఇంటికి రావడం వలన మీ ఇంటికి కొత్త వెలుగొచ్చిందని ఇక జీవితంలో నువ్వు బాగా స్థిర పడతావని అందరూ అంటుంటే ఇది తన అదృష్టరత్నంగా ఆ జాలరి భావించాడు.

అలా రోజులు గడిచేకొద్ది వలలో చేపలు సరిగ్గా పడక తన ఇల్లు పుట గడవడమే కష్టంగా మారింది.పిల్లల్ని బాగా చదివించాలని అతని కల కలగానే మిగిలిపోతుందని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు.తినడానికి తిండి కూడా లేని రోజులు ఎన్నో వారి జీవితాల్లో చోటుచేసుకున్నాయి.10 సంవత్సరాలు కష్టాలతోనే కాలం గడిపారు ఆ జాలరి కుటుంబం.ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుంటే ఇంటికి దగ్గరగా మంటలు వ్యాపించాయి అవి ఆ జాలరి ఇంటికి కూడా తాకడంతో , అది గమనించిన జాలరి తన భార్యను, పిల్లల్నిరక్షించుకుంటాడు.ఇంతలో సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడకు వచ్చి మంటలు ఆర్పేశారు , అప్పటికే వారి ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిద అవుతాయి.

మంటలన్నీ ఆరిన తరువాత ఆ జాలరి ఇంటి లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకోని కొన్ని వస్తువులను బయటకు తీసుకొచ్చారు , అందులో 10 సంవత్సరాల క్రితం దొరికిన ఆ 40కిలోల బరువు గల రాయి కూడా ఉంది , ఆ వస్తువులను గమనిస్తున్న ఆ ఫైర్ స్టేషన్ సిబ్బందిలో ఒకరు ఆ రాయిని చూసి అనుమానం వచ్చి దాన్ని ల్యాబ్ కు పంపించాడు.

700 కోట్ల రూ.విలువ గల ముత్యం

ఆ ల్యాబ్ లోని అధికారులు ఆ రాయిపై ఎన్నో పరిశోధనలు చేసి అది ఒక ముత్యంగా గుర్తించి ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యం ఇదేనని తేల్చి చెప్పారు.దాదాపు 40 కేజీలు బరువు కలిగిన ఆ ముత్యం విలువ ఇప్పటి మార్కెట్ రేటును బట్టి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ఆ ల్యాబ్ అధికారులు అంచనా వేశారు.

అంతే ఆ జాలరి తన రాత మారబోతుందని గ్రహించి ఆ రాయిని అమ్మకానికి పెట్టాడు.ప్రపంచంలోని ఎన్నో న్యూస్ చానెల్స్ ఈ రాయి గురించే మాట్లాడడం వలన ఎంతోమంది వ్యాపారస్తులు ఈ రాయిని కొనడానికి ముందుకు వచ్చారు.

ఆ ముత్యం దాదాపుగా 700 కోట్ల రూపాయల వరకు అమ్ముడుపోయింది.ఆ తెల్లటి మెరిసే ముత్యం దాదాపు 1,70,000 క్యారేట్ లు గలది .తినడానికి తిండి కూడా లేని ఎన్నోదారుణ పరిస్థితులు అనుభవించిన జాలరి కుటుంబం ఇప్పుడు 10 అంతస్థుల బిల్డింగ్, ఎంతో ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు.ఈ జాలరి ఇంట్లోనే విలువైన ఆస్తిని పెట్టుకొని బయట బంగారం కోసం వెతికినట్లుంది.

కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోప్పం లో అదృష్టం కలిసి వచ్చి జీవితం మలుపు తిరుగుతుంది అనడానికి ఈ ఫిలిప్పీన్స్ కి చెందిన జాలరి కథే ఒక ఉదాహరణ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube