ఇది చూసిన తర్వాత సముద్రం వద్ద జాగ్రత్త పడతారు... ఫొటోలు దిగుతున్న యువతిని ఎత్తేసిన సముద్రపు అల

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అంటూ ఒక తెలుగు పాట ఉంది.నిజంగా ఆ పాట అక్షర సత్యం అనిపిస్తుంది.

 The Sea Wave That Raises On Young Girl2-TeluguStop.com

ఏ నిమిషంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో, ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు.ప్రతి ఒక్కరు కూడా ఆ నిమిషం వరకే బతుకు అన్నట్లుగా జీవితంను సాగించడం బెటర్‌.

ఎందుకంటే వచ్చే సెకనులో మనం ఉంటామా లేదా అనేది చెప్పలేం.ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం.

చావు అనేది ఏ రకంగా అయినా రావచ్చు.ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చావుతో చెలగాటమే.

సముద్రంలోకి మనం సరదా కోసం వెళ్తూ ఉంటాం.కాని ఆ సముద్రం ఉగ్రరూపం దాల్చితే సరదా కాస్త విషాదం అవుతుంది.

సరదాగా సముద్రం వద్దకు వెళ్లిన ఒక ఇండోనేషియన్‌ అమ్మాయిని సముద్రపు అలలు అమాంతం ఎత్తేయడం జరిగింది.ఆమె సముద్రపు అలల దాటికి మరణించి ఉంటుందని అంతా భావించారు.

ఆమె ఎగిరిన వేగంకు ఖచ్చితంగా ఆమె బతికే అవకాశం ఉండదని భావించారు.చుట్టు బండలు ఉన్న కారణంగా రాకాసి అలలు ఆమెను బండకు కొట్టి ఉంటాయని ఊహించారు.

కాని అనూహ్యంగా ఆమెకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యి బతుకు జీవుడా అంటూ బయట పడింది.ఆమె నిజంగా అదృష్టవంతురాలని, అంతటి ప్రమాదం నుండి బయట పడిందని అక్కడ అంతా అనుకున్నారు.

ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్‌ అనే ప్రాంతంలో ఒక టూరిస్ట్‌ ప్లేస్‌ ఉంది.అక్కడ సముద్రం చాలా అహ్లాదకరంగా ఉంటుంది.అద్బుతమైన ఆ వాతావరణంను ఎంజాయ్‌ చేసేందుకు ప్రతి రోజు కొన్ని వందల మంది అక్కడకు వెళ్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక అమ్మాయి ఫొటోలు దిగేందుకు సముద్రంలోకి కాస్త ముందుకు వెళ్లింది.

అదే సమయంలో ఒక పెద్ద అల వచ్చింది.ఆ అల చివరి వరకు వస్తుందని ఎవరూ ఊహించలేదు.

కాని ఆ అల అమాంతం ఆమెను లేపి పడేశాయి.చుట్టు బండరాలు ఉన్న కారణంగా ఆమె బండరాళ్లపై పడి మృతి చెందుతుందని భావించారు.

కాని నీరంతా వెనక్కు పోయిన తర్వాత మళ్లీ ఆమె కనిపించింది.కొన్ని సెనక్ల పాటు తాను చనిపోయినట్లుగానే భావించాను అని, కాని అదృష్టం బాగుంది నేను గాయాలతో బయట పడ్డాను అంటూ ఆమె చెప్పడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube