కాజల్‌ మళ్లీ బిజీ అవుతోంది... మాస్‌ రాజా కూడా ఇచ్చాడు

కాజల్‌ ఒకప్పుడు చాలా బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.అయితే ఈ అమ్మడు గత రెండేళ్లుగా కాస్త ప్రాభవం తగ్గిందని చెప్పుకోవాలి.

 Kajal Getting Busy Again With Movie Schedules-TeluguStop.com

అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ ను నెట్టుకు వస్తున్నాడు.ప్రస్తుతం కాజల్‌ మళ్లీ బిజీ అవుతోంది.

ఇటీవలే ఈ అమ్మడు ‘ఇండియన్‌ 2’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెల్సిందే.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె రవితేజకు జోడీగా హీరోయిన్‌ పాత్రకు ఎంపిక అయినట్లుగా సమాచారం అందుతోంది.

కాజల్‌ హీరోయిన్‌గా రవితేజ గతంలో రెండు సినిమాలు చేశాడు.ప్రస్తుతం రవితేజ పెద్ద ఎత్తున తేరీ రీమేక్‌లో నటిస్తున్నాడు.సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది.గతంలో వీరిద్దరి కాంబోకు సక్సెస్‌ దక్కింది.

అందుకే మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఒక వైపు రవితేజ డిస్కోరాజా అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రం పూర్తి కాకుండానే ఈ చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యాడు.ఈ రెండు సినిమాలు కూడా రెండు మూడు నెలల తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న తేరీ రీమేక్‌లో కాజల్‌ నటించబోతున్న కారణంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube