ఐపీఎల్ లో ఈ క్యాప్ లకి ఇచ్చే ప్రైజ్ ఎంతో తెలిస్తే షాక్ .. వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కన్నా ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎక్కువ..

ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇందులో ఒక్క సీజన్ ఆడితే చాలు కోటీశ్వరులు అవ్వడం ఖాయం , అత్యంత పారితోషికం ఇచ్చే క్రికెట్ లీగ్ .ఇందులో ఇచ్చే ప్రైజ్ మనీ దాదాపు వరల్డ్ కప్ ప్రైజ్ మనీ తో సమానం , గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ కి 20 కోట్లు , రన్నరప్ కి 12.5 కోట్లు ప్రైజ్ మనీ అందచేశారు , ఈ సారి ఆ ప్రైజ్ మనీ ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఐపీఎల్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ కాకుండా ఇతర ప్రైజ్ మనీ లు ఏంటో చూడండి.

 Do You Know About Ipl Prize Maney-TeluguStop.com

మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌.


లీగ్‌ స్థాయి – రూ.లక్ష, ట్రోఫీ
ప్లే ఆఫ్స్‌ – రూ.5లక్షలు, ట్రోఫీ
ప్లే ఆఫ్స్‌లో రాణించిన ఆటగాళ్లకు ఈ బహుమతిని బీసీసీఐ ప్రదానం చేస్తుంది.

వివో పర్ఫెక్ట్‌ క్యాచ్‌


ఒక మ్యాచ్‌కి – రూ.లక్ష, ట్రోఫీ, వీవో మొబైల్‌
సీజన్‌ మొత్తం – రూ.10లక్షలు, ట్రోఫీ, వివో మొబైల్‌‌.
అద్భుతమైన క్యాచ్‌ అందుకున్న వాళ్లకి ఈ బహుమతి అందజేస్తారు.

ప్రేక్షకుల ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.వివో సంస్థ బహుమతులు అందిస్తుంది.

టాటా నెక్సాన్‌ సూపర్‌ స్ట్రైకర్‌


ఒక మ్యాచ్‌కి – రూ.లక్ష, ట్రోఫీ
సీజన్‌ మొత్తం – టాటా నెక్సాన్‌ కారు, ట్రోఫీ
ఎక్కువ స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన ఆటగాడికి ఈ బహుమతికి ఎంపిక చేస్తారు.ఆటగాళ్లకు రెండు నిబంధనలు విధించారు.ఒక మ్యాచ్‌లోనైతే బ్యాట్స్‌మన్‌ కనీసం ఆరు నుంచి 15 బంతులైనా ఎదుర్కొని ఉండాలి.సీజన్‌ మొత్తంలో కనీసం 7 మ్యాచులు ఆడటంతో పాటు 42 బంతులు ఎదుర్కొని 105 పరుగులైనా చేసి ఉండాలి.

ఎఫ్‌బీబీ స్టైలిష్‌ ప్లేయర్‌


ఒక మ్యాచ్‌కి – రూ.లక్ష, ట్రోఫీ
సీజన్‌ మొత్తం- రూ.10లక్షలు, ట్రోఫీ
ఆటగాడి ఆత్మవిశ్వాసం, మైదానంలో కదలికలు, ఆట విధానం, ఒత్తిడి, ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయిస్తారు.సీజన్‌ మొత్తంలో ఎక్కువ సార్లు ఎవరైతే ఈ అవార్డును గెలుచుకుంటారో ఆ ఆటగాడినే సీజన్‌ అవార్డు వరిస్తుంది.విజేతలను వ్యాఖ్యాతల బృందం నిర్ణయిస్తుంది.

స్టార్‌ ప్లస్‌ నయీ సోచ్‌


ఒక మ్యాచ్‌కి – రూ.లక్ష, ట్రోఫీ
సీజన్‌ మొత్తం – రూ.10లక్షలు, ట్రోఫీ
వ్యూహాల్లో భాగంగా వినూత్న ఆలోచనను విజయవంతంగా అమలు చేసిన ఆటగాడికి ఈ అవార్డు ఇస్తారు.ఈ బహుమతి గెలుచుకున్న వాళ్లందరిలో ఒకర్ని ఎంపిక చేసి సీజన్‌ అవార్డు ఇస్తారు.

ఆరెంజ్‌ క్యాప్‌ – రూ.10లక్షలు, ట్రోఫీ


ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఈ క్యాప్‌ ఇస్తారు.2008లో షాన్‌ మార్ష్‌ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) గెలుచుకోగా 2018లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ సొంతం చేసుకున్నాడు.

పర్పుల్‌ క్యాప్‌- రూ.10లక్షలు, ట్రోఫీ


సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే అవార్డు.2008లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు సొహైల్‌ తన్వీర్‌‌, 2018లో భువనేశ్వర్‌ కుమార్ గెలుచుకున్నారు.

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ – రూ.10లక్షలు, ట్రోఫీ


సీజన్‌ ముగింపులో పాయింట్ల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో ఉంటే వాళ్లకు దీనిని ఇస్తారు.2008లో రాజస్థాన్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌, 2018లో సునిల్‌ నరైన్‌ అందుకున్నారు

ఎమర్జింగ్‌ ప్లేయర్‌- రూ.10 లక్షలు


ఈ బహుమతిని బీసీసీఐ అందజేస్తుంది.భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలడని నమ్మకం కలిగించిన ఆటగాడికి దీనిని ఇస్తారు.దీనిని అందుకోవాలంటే కొన్ని నియమాలున్నాయి.ఈ అంశాలతో పాటు ఐపీఎల్ వెబ్సైట్ లో ఓట్లను కూడా చూస్తారు.
1.ఏప్రిల్‌ 1, 1992 తర్వాత జన్మించి ఉండాలి.
2.ఐదు కన్నా తక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
3.ఐపీఎల్‌లో కనీసం 25 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
4.ఇంతకు ముందు ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు విజేత కాకూడదు.

ఒక మైదానంలో ఏడు లేదా అంత కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరిగేలా పిచ్‌ను సిద్ధం చేసిన వాళ్లకు ‘పిచ్‌ అండ్‌ గ్రౌండ్‌’ అవార్డులు ఇస్తారు.రూ.50లక్షలతో పాటు ట్రోఫీ అందజేస్తారు.ఏడు కన్నా తక్కువ మ్యాచ్‌లకు పిచ్‌ సిద్ధం చేసిన వాళ్లకు రూ.25లక్షలు అందజేస్తారు.ఇంకా గ్రౌండ్ సిబ్బందికి , అంపైర్ లకి ప్రత్యేకమైన బహుమతులు ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube