వావ్‌ : డాక్టర్‌, పేషంట్‌ మద్య 3 వేల కిలోమీటర్ల దూరం... అయినా జరిగిన ఆపరేషన్‌ సూపర్‌ సక్సెస్‌

మారుతున్న టెక్నాలజీని అన్ని రంగాల్లోకి కూడా విస్తరిస్తున్నారు.ఎంత టెక్నాలజీ మారినా కూడా కొన్ని మాత్రం అలాగే ఉంటాయి.

 Chinese Surgeon Performs Remote Brain Surgery 3000km Away-TeluguStop.com

ముఖ్యంగా ఒక పేషంట్‌కు ఆపరేషన్‌ చేసే విధానం మాత్రం మారదు.ఆపరేషన్‌కు వినియోగించే టెక్నాలజీ మారే అవకాశం ఉన్నా ఆపరేషన్‌ చేసే డాక్టర్‌ మాత్రం అవే జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్‌ చేస్తారు.

అయితే ప్రపంచంలోనే మొదటి సారి ఒక డాక్టర్‌ పేషంట్‌ దగ్గర లేకుండా ఆపరేషన్‌ నిర్వహించాడు.ఒక 5జీ టెక్నాలజీ హ్యాండ్‌ను ఉపయోగించి ఏకంగా పేషంట్‌ బ్రెయిన్‌ ఆపరేషన్‌ను డాక్టర్‌ నిర్వహించడంతో వైధ్య శాస్త్రంలో కొత్త అద్యయం మొదలైనట్లయ్యింది.

ఎక్కడో మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డాక్టర్‌ పేషంట్‌కు ఆపరేషన్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.కాని అది హవాయి సంస్థ తయారు చేసిన 5జీ టెక్నాలజీ కంప్యూటర్‌, రోబోటిక్‌ హ్యాండ్‌ వల్ల సాధ్యం అయ్యింది.

ఆ పరిజ్ఞానంతో జరిగిన మొదటి ఆపరేషన్‌గా ఇది చరిత్రలో నిలిచి పోయింది.ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఈ ఆపరేషన్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఆపరేషన్‌కు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనా దేశం బీజింగ్‌లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో రోగి మెదడు సంబందిత వ్యాదితో బాధపడుతూ ఉన్నారు.ఆయన ఆపరేషన్‌కు అంతా సిద్దం చేశారు.అయితే డాక్టర్‌ మాత్రం ఎక్కడో మూడు వేల కిలోమీటర్ల దూరంలో మరో ప్రాంతంలో ఉన్నాడు.లింగ్‌ జీపీ అనే ఆ వైధ్యుడు అయినా కూడా ఆ బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.5జీ టెక్నాలజీ సాయంతో అతడు బ్రెయిన్‌ ఫేస్‌ మేకర్‌ ను ఎక్కించారు.పార్కిన్సన్స్‌ వ్యాదితో బాధపడుతున్న ఆ వ్యక్తికి పూర్తిగా నయం చేశారు.ఇది వైధ్య శాస్త్రంలో ఒక అద్బుతంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube