పూజా హెగ్డేతో రొమాన్స్ స్టార్ట్ చేస్తున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీ షూటింగ్ కూడా మొదలెట్టేసాడు.

 Prabhas Started Romance With Pooja Hegde With His Next Movie-TeluguStop.com

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటలీలో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ తాజాగా మొదలైంది.

సాహో సినిమా షూటింగ్ మెజారిటీ పూర్తిగా కావడంతో దానికి ప్రభాస్ గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం ఈ లవ్ స్టొరీ షూటింగ్ కి రెడీ అయ్యాడు.ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన వింటేజ్ ఇటలీ సెట్ లో ప్రభాస్, పూజాహెగ్డే జాయిన్ అవ్వబోతున్నారు.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత మరల ప్రభాస్ సాహో ఫినిషింగ్ వర్క్ పూర్తి చేసుకొని కంప్లీట్ గా ఈ లవ్ స్టొరీ మీద ద్రుష్టి పెడతాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా యూవి క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా వందకోట్లకి పైగా బడ్జెట్ తోనే నిర్మిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube