బాబు విషయంలో కేసీఆర్ స్పీడ్ ఎందుకు తగ్గింది ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్తే చాలు ఒంటికాలుమీద లేచే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం దొరికినప్పుడల్లా ఆయన మీద విమర్శల బాణాలు వేస్తూనే ఉంటారు.తెలంగాణాలో మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి మరీ కేసీఆర్ మీద రాజకీయ యుద్ధం చేసాడు.

 Why Kcr Takes U Turn About Chandrababu-TeluguStop.com

అయితే ఆ కూటమి ప్రభావం పెద్దగా కనిపించలేదు.మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే అధికారం దక్కించుకుంది.

కానీ కేసీఆర్ లో మాత్రం బాబు మీద కసి అమాంతం పెరిగిపోయింది.అందుకే వైసీపీ కి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సపోర్ట్ చేస్తూ టీడీపీని ఓడించాలని చూస్తోంది.

గడిచిన ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.రోజుకో కొత్త తిట్టుతో చంద్రబాబునాయుడిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

నెల రోజుల క్రితం వరకు కేసీఆర్ చంద్రబాబు నాయుడుల మధ్య విమర్శల హోరు తారాస్థాయికి చేరింది.కాకపోతే గత 20 రోజులుగా మాత్రం కేసీఆర్ వెర్షన్ బాగా మారిపోయింది.

బాబు మాటే కేసీఆర్ ఎత్తడంలేదు.దీంతో కేసీఆర్ ఒక్కసారిగా యూ టర్న్ ఎందుకు తీసుకున్నాడో అన్న చర్చ మొదలయ్యింది.

తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల పోరు తీవ్రతరం అవ్వడంతో ఇక్కడ ఉన్న 16 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలకు కేసీఆర్ పదును పెడుతున్నారు.తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు లక్షల్లో ఉన్నాయి.

కొన్ని లోక్ సభ నియోజక వర్గాలలో బాబు సామజిక వర్గానికి చెందిన నాయకులే ఫలితాలను తారుమారు చేసే రేంజ్ లో ఉండడంతో కేసీఆర్ ఆలోచనలోపడ్డాడట.అందుకో అనవసరంగా ఏపీ పాలిటిక్స్ లో తలదూర్చి కొత్త ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు.కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణ లోక్ సభ లోని అన్ని స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది.అందుకే కేసీఆర్ బాబు విషయంలో కొంత వెనక్కి తగ్గాడు.

ఒకరకంగా చూస్తే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం బాబు కి మేలు చేసే విధంగానే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube