తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులకు బ్యాడ్‌ న్యూస్‌... మరోసారి అడ్జస్ట్‌ అవ్వాల్సిందే

దేశ వ్యాప్తంగా మంచి పేరున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ ను తెలుగులో గత రెండు సంవత్సరాలుగా ప్రసారం చేస్తున్న విషయం తెల్సిందే.బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా సూపర్‌ హిట్‌ అయ్యింది.

 Bad News For Telugu Big Boss Fans-TeluguStop.com

భారీ టీఆర్పీ రేటింగ్స్‌తో దుమ్ము రేపింది.ఇక రెండవ సీజన్‌ను నాని హోస్ట్‌ చేశాడు.

నాని హోస్టింగ్‌తో ఆ షోకు పెద్దగా ఆధరణ దక్కలేదు.అయితే కౌశల్‌ ఆర్మీ కారణంగా కాస్త షో నడిచిందని చెప్పుకోవచ్చు.

ఇక మూడవ సీజన్‌కు మళ్లీ ఎన్టీఆర్‌ను తీసుకు వచ్చేందుకు మా టీవీ వారు ప్రయత్నించారు.

మాటీవీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మూడవ సీజన్‌కు ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిపారు.మొదటి సీజన్‌తో పోల్చితే 50 శాతం అధిక పారితోషికాన్ని కూడా నిర్వాహకులు ఎన్టీఆర్‌కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

అయితే తాజాగా ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మల్టీస్టారర్‌లో నటిస్తున్న కారణంగా బిగ్‌బాస్‌కు నో చెప్పాడు.రాజమౌళి సినిమాలో చేసే సమయంలో మరే సినిమాలో కూడా చేసే అవకాశం ఉండదు.

జక్కన్న అందుకు ఒప్పుకోడు.అందుకే ఎన్టీఆర్‌ సీజన్‌ 3కి నో చెప్పాడు.

ఎన్టీఆర్‌ మళ్లీ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేస్తాడని ఆశించిన వారికి ఇది నిరాశే అని చెప్పక తప్పదు.పలువురు స్టార్స్‌ను బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి హోస్టింగ్‌ కోసం ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.చివరకు నాగార్జున ఓకే అయ్యేలా కనిపిస్తోంది.నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో అలరించాడు.అందుకే మరోసారి నాగార్జునను మా బుల్లి తెరపై చూపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.మా స్టార్‌ యాజమాన్యం నాగార్జునతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube