విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ అసంతృప్తి... డియర్‌ కామ్రేడ్‌ మేకర్స్‌ టెన్షన్‌

విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంకు భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

 Vijay Devarakonda Fans Fires On Dear Comrade Movie Makers-TeluguStop.com

స్టూడెంట్‌ లీడర్‌గా ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు.ఇక ఈ చిత్రంకు సంబంధించిన టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టీజర్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.ముద్దు సీన్‌ పెట్టడంతో టీజర్‌కు మంచి హైప్‌ వచ్చిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ముద్దు సీన్‌ తప్ప మరేం లేదు అంటూ నిటూర్చుతున్నారు.

టీజర్‌ అంటే సినిమాలో హీరో పాత్రను కొన్ని సెకన్ల పాటు అయినా పరిచయం చేయాలని, కాని ఇదేదో మోషన్‌ పోస్టర్‌ చూసినట్లుగానే అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విజయ్‌ దేవరకొండ టీజర్‌ అంటే ఇంకాస్త బెటర్‌గా ఊహించుకున్నామని, కాని మా ఊహకు టీజర్‌ అందుకోలేక పోయిందని కొందరు అంటున్నారు.ముద్దుసీన్‌ వరకు ఓకే కాని అంతుకు ముందు ఉన్న షాట్‌ ఏమాత్రం బాగాలేదని అంటున్నారు.స్లో మోషన్‌లో విజయ్‌ దేవరకొండ వ్యక్తిని కొట్టడం చూపించారు.అయితే అది అంత సహజంగా లేదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి విజయ్‌ దేవరకొండ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న డియర్‌ కామ్రెడ్‌ సినిమా టీజర్‌ విషయంలో కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో టీజర్‌ వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి.సినిమాను మే చివరి వారంలో విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు.అంటే సినిమాకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది.

కనుక అప్పటి వరకు మరో టీజర్‌ తో లేదా ట్రైలర్‌తో సినిమాను అమాంతం పైకి ఎత్తే అవకాశం లేకపోలేదు.దేవరకొండ మూవీకి ఏదైనా సాధ్యమే అని ఆయన గత సినిమాలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube