వైకాపాలో జాయిన్‌ అయిన తనీష్‌... ఆ సమయంలో ఏమన్నాడో తెలుసా?

బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తనీష్‌ చిన్నతనంలోనే పలు అవార్డులు మరియు రివార్డులను దక్కించుకున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున చిన్నప్పుడు నటించిన తనీష్‌ పెద్ద అయిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 Tanish Joined In To Ycp For The Reason Is-TeluguStop.com

హీరోగా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం అయినా కూడా ఇప్పటి వరకు తనీష్‌కు ఒక్క మంచి సక్సెస్‌ దక్కలేదు.మెల్ల మెల్లగా ఆయన హీరోగా కనుమరుగవుతున్న సమయంలో బిగ్‌బాస్‌ షోలో కనిపించాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2తో మంచి గుర్తింపును, ఫేమ్‌ను దక్కించుకున్న తనీష్‌ మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం అని అంతా భావించారు.కాని అనూహ్యంగా తనీష్‌కు పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదు.

ఆమద్య కౌశల్‌తో వివాదం కారణంగా మీడియా ముందుకు వచ్చిన తనీష్‌ కౌశల్‌ ఆర్మీలో గొడవలకు కారణం అనే ఆరోపణ ఎదుర్కొన్నాడు.కౌశల్‌ ఆర్మీ మెంబర్స్‌ కొందరు తనీష్‌ను కలవడం, వారు తనీష్‌తో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటివి చేశారు.దాంతో కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌పై విమర్శలకు తనీష్‌ కారణం అయ్యి ఉండవచ్చు అని కొందరు అనుమానించారు.అయితే ఆ విమర్శలను తనీష్‌ కొట్టి పారేశాడు.తాజాగా తనీష్‌ రాజకీయరంగ ప్రవేశం చేశాడు.

కర్నూలులో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ను కలిసిన తనీష్‌ పార్టీ కండువ కప్పించుకున్నాడు.ఏపీ అభివృద్దిలో ముందుకు వెళ్లాలి అంటే ఖచ్చితంగా జగన్‌ సీఎం అవ్వాలి అంటూ పిలుపునిచ్చాడు.రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌ గెలుపు కోసం వైకాపా తరపున ప్రచారం చేస్తానంటూ తనీష్‌ చెప్పుకొచ్చాడు.

తనీష్‌ ప్రచారం వైకాపాకు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube