ఆ మాస్టారు అంటే, ఆయన చెప్పే పాఠాలు అంటే విధ్యార్థులకు చాలా ఇష్టం... కాని అతడి పాఠాలే అతడిని జైలుకు పంపించాయి

మారిన పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను క్లాస్‌లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం చాలా కష్టం అయ్యింది.ముఖ్యంగా కాలేజ్‌ పిల్లలను గంట సమయం క్లాస్‌లో కూర్చోబెట్టి సబ్జెక్ట్‌ చెప్పడం అనేది ఉపాధ్యాయులకు చాలా కష్టంగా మారింది.

 Lecturer Love Lessons Send Him To Jail1-TeluguStop.com

వారికి బోర్‌ కలిగించకుండా, సబ్జెక్ట్‌తో పాటు సరదా విషయాలను కూడా చెబుతూ ఉంటేనే వారు క్లాస్‌లో కూర్చునేందుకు ఆసక్తి చూపుతుంటారు.క్లాస్‌ పూర్తి అవ్వకుండానే పర్మిషన్‌ తీసుకోకుండా బయటకు వెళ్లే వారు చాలా మంది ఉంటున్నారు.

అందుకే హరియాణాకు చెందిన ఒక ప్రొపెసర్‌ విద్యార్థులను ఆకట్టుకునేలా విద్యను బోధించాలని చిక్కుల్లో పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… హరియాణా ప్రభుత్వ మహిళ కళాశాలలో గణితంను బోధించే చరణ్‌ సింగ్‌ అంటే అక్కడి విద్యార్థులకు చాలా గౌరవం.

ఎందుకంటే ఆయన లెక్కలు అర్థం అయ్యేలా చెప్పడంతో పాటు, ఆ లెక్కల వెనుక ఉన్న అర్థాలను చాలా సరదాగా చెబుతాడు.ఎప్పుడు సబ్జెక్ట్‌ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇతర విషయాలను కూడా ఆయన వివరిస్తూ ఉంటాడు.

తాజాగా తన క్లాస్‌ విద్యార్థినులకు ప్రేమ, స్నేహం, క్రష్‌ ల గురించి తెలియజేసేందుకు ప్రయత్నించాడు.దాన్ని లెక్కల రూపంలో చెప్పాలనుకున్న ఆయన అందరికి తెలిసే విధంగా చెప్పేందుకు ప్రయత్నించాడు.

ఆ ప్రేమ, స్నేహం లెక్కల పాఠాలను ఒక అమ్మాయి తన ఫోన్‌లో వీడియో తీసింది.తమ మాస్టారు ఎంత చక్కగా లెక్కలు చెబుతున్నాడో చూడండి, తమకు ఈ మాస్టారు అంటే చాలా ఇష్టం అంటూ ఆ వీడియోతో పాటు పోస్ట్‌ చేసింది.ఆమె చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.మెల్ల మెల్లగా ఆ పోస్ట్‌ ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో లెక్కలు చెప్పకుండా ప్రేమ పాఠాలు చెప్పినందుకు ఆయన్ను డ్యూటీ నుండి తొలగించడంతో పాటు పోలీసు కేసు పెట్టడం జరిగింది.

దాంతో పోలీసులు చరణ్‌ సింగ్‌పై కేసు నమోదు చేశారు.

ఇంతకు చరణ్‌ సింగ్‌ మాస్టారు చెప్పిన ఆ పాఠాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఒక వ్యక్తితో సాన్నిహిత్యం, ఆకర్షణను మరో వ్యక్తి కలిగి ఉంటాడు.వాటి రెంటిని తీసి వేస్తే స్నేహం అవుతుంది, రెంటిని కలిపితే ప్రేమ అవుతుంది అంటూ తనదైన శైలిలో లెక్కలు వేసి మరీ చూపించాడు.

ప్రేమ = సాన్నిహిత్యం + ఆకర్షణ
స్నేహం = సాన్నిహిత్యం – ఆకర్షణ
క్రష్‌ = ఆకర్షణ – సాన్నిహిత్యం
రొమాన్స్‌ = స్నేహం + సాన్నిహిత్యం + ఆకర్షణ + ప్రేమ

వీటికి కాస్త తీక్షణంగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది.కానీ ఆయన ఒక ప్రొఫెసర్ హోదాలో ఉంది ఇవి చెప్పడం వల్ల ఆయన నేరస్తుడు అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube