పొలిటికల్ 'స్టార్స్' ఎవరు ఎవరికి మద్దతు అంటే ?

సినిమా రాజకీయం ఈ రెండు వేరు వేరు రంగాలైనా ఒకదానితో ఒకటి ఎప్పుడూ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి.సినిమా స్టార్స్ చాలామంది అటు రాజకీయాల్లోనూ ఇటు వెండితెర మీద రెండు పడవల మీద ప్రయాణం చేస్తుంటే కొంతమంది సినీ ఇండస్ట్రీ వారు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి పాలిటిక్స్ లోకి దిగుతున్నారు.

 Cine Stars Support For The Ap Political Parties-TeluguStop.com

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎప్పుడూ సినీ గ్లామర్ కోసం ఆరాటపడుతూనే ఉంటాయి.ఏపీలో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఆయా పార్టీల్లో సినీ గ్లామర్ బాగా పెరిగింది.

తమ సినిమాలను సైతం పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు.

కొంతమంది సినీ జనాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు దక్కించుకోగా మరికొందరు నామినేటెడ్ పోస్ట్ ల హామీతో ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు.మూడు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు.ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ మరింత పెంచేపనిలో ఉండగానే సినిమా స్టార్స్ కూడా ఎంట్రీ ఇచ్చేసి ఆయా పార్టీల తరపున విమర్శలు -ప్రతి విమర్శలు చేస్తూ తమ భక్తి చాటుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటే సినీ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు.రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్‌ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాఆయన తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు.

నిర్మాతలు వల్లభనేని వంశీ, మాగంటి బాబు మరోసారి ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన దివ్యవాణి, వాణి విశ్వనాథ్‌లు టీడీపీ తరపున గట్టిగానే తమ వాయిస్ వినిపిస్తున్నారు.టీడీపీ కి సంబందించిన యాడ్స్ రూపకల్పన వంటి విషయాల్లో టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరవెనుక తన టాలెంట్ చూపిస్తున్నాడు.

వైసీపీ నుంచి చూస్తే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి సినీ నటి రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.హాస్య నటుడు పృథ్వీరాజ్‌, రచయిత పోసాని కృష్ణమురళి తమ వాయిస్ వినిపించేందుకు సిద్ధం అయ్యారు.ఇటీవలే సీనియర్‌ నటి జయసుధ, హాస్యనటుడు అలీ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్‌, భానుచందర్‌, వర్ధమాన నటులు కృష్ణుడు పార్టీలో చేరిపోయారు.

ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే వారిలో పవన్ అన్నయ్య నాగబాబు చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.ఆయనకు సపోర్ట్ గా జబర్దస్త్ టీమ్ పనిచేస్తోంది.ఇలా ప్రతి పార్టీలో సినీ జనాలు తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube