అబ్దుల్ కలామ్ గారి పొడవాటి హెయిర్ స్టైల్ వెనుక అసలు కథేంటో మీకు తెలుసా ? అదేంటో చూడండి....

సినిమాల్లో ఒక్కో హీరో కి ఒక్కో హెయిర్ స్టైల్ ఉంటుంది వారి హెయిర్ స్టైల్స్ ని యూత్ ఫాలో అవుతుంటారు.హీరో లే కాకుండా క్రికెట్ ఆటగాళ్లు కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తూ ఉంటారు.

 Reason Behind Abdul Kalam Long Hair Style-TeluguStop.com

వారికి దీటుగా దేశం అంత చర్చించుకున్న హెయిర్ స్టైల్ మాజీ రాష్ట్రపతి భారత్ రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హెయిర్ స్టైల్.మన దేశంలోనే ఆయన హెయిర్ స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ ,అసలు ఆయన పొడవాటి హెయిర్ స్టైల్ వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా ? ఆయన హెయిర్ స్టైల్ మీద రకరకాల కథలు ఉన్నాయి అవేంటో చూద్దాం.

అబ్దుల్ కలామ్ గారి హెయిర్ స్టైల్ కి కారణం


తమిళనాడు లోని రామనతపురం లో ఉండే అబ్దుల్ కలాం గారి పూర్వికులు పొడవాటి జుట్టు పెంచడం ఆనవాయితీగా ఉండేదట , అబ్దుల్ కలాం గారు కూడా ఆయన పూర్వీకుల ఆచారాలను తన చిన్నతనం నుండి పాటించేవారు.ఆ ఆచారాన్ని ఆయన ఎప్పుడూ తప్పలేదు ఆయన చనిపోయేవరకు అదే హెయిర్ స్టైల్ ని ఫాలో అయ్యారు.

న్యూ ఢిల్లీ లో ఆయన పూర్వీకులకు సంబందించిన సెలూన్ ఉండేది ఆయన ఎప్పుడూ అక్కడే హెయిర్ కట్ చేయించుకునేవారు , చేయించుకున్న ప్రతి సారి కనీసం 500 రూపాయలు చెల్లించేవారు.

ఢిల్లీ లో పూర్వీకులకి సంబందించిన సెలూన్


అజ్మద్ హాబీబ్ ఆయన తండ్రి హాబీబ్ అహ్మద్ ఇద్దరు సెలూన్ నడిపే వారు , వారే కొన్ని సంవత్సరాలు కలామ్ గారికి కటింగ్ చేసేవారు.అబ్దుల్ కలాం గారికి చిన్నగా కటింగ్ తీసునపుడల్లా కలామ్ గారికి అది నచ్చేది కాదంట .అబ్దుల్ కలాం గారు ఆయన హెయిర్ స్టైల్ కి మాత్రమే ప్రసిద్ధి కాదు ఆయన దేశానికి చేసిన సేవలకు , ఆయన కల్మషం లేని చిరునవ్వు కు ఆయన మేధస్సు కు ఆయన మాటలకు మన దేశం నుండే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఆయన హెయిర్ స్టైల్ పైన ఇంకో స్టోరీ


అబ్దుల్ కలామ్ గారికి చిన్నప్పటి నుండి ఒక చెవి చిన్నదిగా సగభాగమే ఉండేదట , దానితో కలామ్ గారు దానిని కవర్ చేయడానికి తన జుట్టును పెద్దగా పెంచారంట.అదే హెయిర్ స్టైల్ ని చనిపోయేవరకు ఫాలో అయ్యారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube