గోవా సీఎం మనోహర్ పారికర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.. ముక్కులో సెలైన్ తోనే అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు..

గోవా సీఎం మనోహర్ పారికర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు .ముక్కులో సెలైన్ తోనే అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు.

 All You Need To Know About Goa Cm Manohar Parrikar-TeluguStop.com

గోవా కి 4 సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన మనోహర్ పారికర్ ఇక లేరు , ఆయన మార్చ్17 వ తేదీ సాయంత్రం తుది శ్వాస విడిచారు.ఆయన చదువుకుంది ఐఐటీ కానీ రాజకీయాల్లో ఆయనే మేటి .ఐఐటీ విద్యను అభ్యసించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఆయనే.

గోవా లోని మపూసలిలో 1955 ,డిసెంబర్ 13 న మనోహర్ జన్మించారు.తన పాఠశాల రోజుల నుండే ఆర్ ఎస్ ఎస్ లో క్రియాశీలకంగా పనిచేశారు.1994 లో తొలిసారి గోవా శాసన సభ కి ఎన్నికయ్యారు , 1998 99 నాటికి గోవా ప్రతిపక్ష నేతగా ఎదిగారు.2000 అక్టోబర్ 24 న మనోహర్ పారికర్ తొలిసారిగా గోవా కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన కి దేశ భక్తి ఎక్కువ అలాగే ప్రజలకి మంచి చేయాలని తపన ఆ తపనే ఆయనను నాలుగు సార్లు గోవా సీఎం పీఠం పైన కూర్చోబెట్టింది.

మనోహర్ పారికర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

1.మనోహర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన తన సొంత ఇంట్లోనే నివసించేవారు , తను ప్రతిపక్షం లో ఉన్నపుడు వాడిన ఇన్నోవా కారు నే ముఖ్యమంత్రి అయ్యాక కూడా వాడారు.

2.మనోహర్ ముఖ్యమంత్రి లా కాకుండా సామాన్య ప్రజలతో బయట తిరిగే వారు , అతను ఎక్కువగా రిక్షా , ఆటోలలో ప్రయనించేవారు.

ఆయన విమనలలో కూడా ఎకనామిక్ క్లాస్ లొనే ప్రయనించేవారు.

3.ఆయన 60 ఏళ్ళ వయసు పై బడిన వారైనా కూడా రోజుకు 16 గంటలు పని చేసేవారు.

4.గోవా లో అక్రమంగా మైనింగ్ చేసేవాళ్ళ లైసెన్స్ రద్దు చేశారు అందుకే గోవా లో ప్రజలు ఈయనని ” గోవా యొక్క మిస్టర్ క్లీన్ ” అంటారు.

5.మనోహర్ పారికర్ తొలిసారిగా 2000 వ సంవత్సరం లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మరుసటి సంవత్సరమే భార్యను కోల్పోయారు , అయిన ఆయన మనో ధైర్యం తో ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రం మరవలేదు , ఆయనకి ఇద్దరు కుమారులు ఉత్పల్ , అభిజిత్.

6.ఈయన పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్.

7.ఆయన కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నారు , అమెరికాలో వైద్యం చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడలేదు .ఇటీవల ఆయన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముక్కు లో సెలైన్ పైపుతోనే గోవా అసెంబ్లీ కి వచ్చారు.రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టి పనిపట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube