ఆరు సార్లు ఓటమి వెక్కిరించింది , ఏడో సారి విజయం , వెయిటర్ నుండి ఐ.ఏ.ఎస్ కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

ప్రయత్నించకుండా ఓటమిని అంగీకరించడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మిన్న అని పెద్దలు అంటారు.అలా ప్రయత్నించి ప్రయత్నించి చివరికి విజయం సాధించిన ఐ.

 Sevan Attempts A Dream A Tn Mans Inspiring Journey From Waiter To Ias1-TeluguStop.com

ఏ.ఎస్ జయ గణేష్ కథ ఇది.

కె.జయగణేష్ ఐ.ఏ.ఎస్ పుట్టి పెరిగింది తమిళనాడు లోని వెల్లూర్ జిల్లా లో ఉన్న వినవ మంగళం అనే చిన్న గ్రామంలో.ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం లేక చివరికి వెయిటర్ గా పని చేస్తూ తన కల అయిన ఐ.ఏ.ఎస్ ని సాధించడం అనేది చాలా మందికి స్ఫూర్తినిస్తుంది.

జయగణేష్ తండ్రి పదో తరగతి వరకు చదివాడు ,ఆయన ఒక ఫ్యాక్టరీ లో సూపర్ వైజార్ గా నెలకి 4500 సంపాదించేవారు ,అమ్మ ఇంటి పనులు చూసుకుంటుండేది.

జయ గణేష్ తన ఇంట్లో పెద్ద వాడు.తన 10 వ తరగతి వరకు తన గ్రామం లో చదివి , పాలిటెక్నిక్ దగ్గర్లో ఉన్న ఊరిలో 91 శాతం తో పూర్తి చేశాడు కానీ తనకి మెరిట్ లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ లభించలేదని వెల్లూర్ లో ఉన్న తంతాయి పేరియర్ గవర్నమెంట్ కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

తను 10 వ తరగతి వరకు చదువుకున్న స్కూల్ నుండి జయగణేష్ ఒక్కడే ఇంజనీరింగ్ పూర్తి చెయగలిగాడు .మిగితా స్నేహితులందరు కూలి పనులు , చిరు వ్యాపారులు చేసుకునేవారు.జయగణేష్ తండ్రి పెద్దగా చదువుకొనందువల్ల ఆయనకి చదువు విలువ తెలుసు అందుకే కొడుకుని చదివించాలనుకొని ఇంజనీరింగ్ చదివించాడు.జయగణేష్ తండ్రి కి తన వంతు సహకారం ఉంచాలని బెంగళూర్ లో ప్రైవేట్ కంపెనీ లో 2500జీతానికి ఉద్యోగం లో చేరాడు.

కానీ అతనికి వారి ఊరిలో ఉన్న యువకులకు ఏదో చేయాలని , విద్య యొక్క విలువని చెప్పాలనుకొని ఐ.ఏ.ఎస్ అవ్వాలనుకున్నాడు.జయగణేష్ తన జాబ్ ని మానేసి పూర్తిగా సివిల్స్ పైన దృష్టి పెట్టాలనుకున్నాడు.

వరుస ఓటములు

విజయం అనేది ఒక్క రోజులో రాదు ఎన్నో రాత్రులు శ్రమిస్తే తప్ప దక్కదు అలాంటిది మన దేశం లో అత్యంత ప్రతిష్టకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కొన్ని లక్షల మంది పోటీ పడుతుంటారు.పైగా ఒక చిన్న పల్లెటూరు నుండి ఐ.ఏ.ఎస్ అవవడం అంటే చాలా కష్టపడాలి .సివిల్స్ పరీక్ష పైన అవగాహన లేక మొదటి రెండు సార్లు ప్రయత్నించగా కనీసం ప్రిలిమ్స్ పరీక్ష కూడా దాటలేకపోయాడు.జయగణేష్ తను చేసిన మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ని ఆప్షనల్ గా తీసుకున్నాడు.

తరువాత వెల్లూర్ లో సివిల్స్ కి సన్నద్ధం అవుతున్న ఉమ సూర్య ని కలవడం ద్వారా గణేష్ సోషియాలజీ ని ఆప్షనల్ గా ఎంచుకున్నాడు.తరువాత 4 వ సారి ప్రయత్నించగా ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు కానీ మెయిన్స్ దాటలేకపోయాడు.

వెయిటర్ నుండి ఐ.ఏ.ఎస్ వరకు

4 సార్లు ప్రయత్నించిన మెయిన్స్ కూడా దాటలేకపోయాను అనే బాధ ఒక వైపు ఆర్థికంగా డబు లేక తన ప్రయత్నాన్ని అపుకోవాలా అన్న ఆలోచన మరో వైపు , ఇక చేసేది ఏమి లేదని చెన్నైలో వెయిటర్ గా పని చేస్తూ దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఐ.ఏ.ఎస్ కోచింగ్ లో చేరాడు.చాలా కష్టపడి సన్నద్ధం అయి 5 వ సారి ప్రయత్నించగా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు.

ఇంకొక సారి ప్రయత్నించుదం అని 6 వ సారి ప్రయత్నించగా ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగాడు.ఇంతలో ఇంటలిజెన్స్ బ్యూరో లో I.B గా ఉద్యోగం వచ్చింది.ఉద్యోగం చేయాలా లేక తన లక్ష్యం కోసం మళ్ళీ ప్రయత్నించాల అన్న ప్రశ్నని దాటి తన లక్ష్యం కోసం 7 వ సారి ప్రయత్నించగా మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు ఇక ఇంటర్వ్యూ ఏ మిగిలింది.

అప్పటికి ఒక సారి ఇంటర్వ్యూ లో అర్హత కాకపోవడం తనలో కసి ని పెంచింది ఈ సారి గట్టిగా ప్రయత్నించాడు , 2008 లో జరిగిన సివిల్స్ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా 156 వ ర్యాంక్ సాధించి తన కల అయిన ఐ.ఏ.ఎస్ ని సాధించాడు.ఒక చిన్న గ్రామం నుండి ఐ.ఏ.ఎస్ గా ఎదిగిన జయ గణేష్ స్టోరీ ఎంతో మంది కి నిదర్శనం.ఓటమి శాశ్వతం కాదు ప్రయత్నిస్తే విజయం ఎప్పుడు మన బానిసే అనడానికి జయ గణేష్ కథ ఒక ఉదాహరణ….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube