నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వెయ్యి మంది రైతులు

గత కొంత కాలంగా తెలంగాణలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో పసుపు రైతులు తమ పంటలకి గిట్టుబాటు ధర ప్రకటించాలని ఆందోళన చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రభుత్వం నుంచి మాత్రం రైతుల ఆందోళనపై ఎలాంటి స్పందన లేదు.

 Thousand Farmers Ready To Contest On Nizamabad Mp Seat-TeluguStop.com

అసలు రైతుల సమస్యలే లనట్లు టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం మానేసింది.దీంతో నిజామాబాద్ జిల్లా రైతులు తమ ఆందోళనని వినూత్న రీతిలో తెలియజేయడానికి సిద్ధం అయ్యారు.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఒకే సారిగా వెయ్యి మంది రైతులు మిగిలిన పార్టీల అభ్యర్ధులపై పోటీగా దిగాలని ఆలోచన చేస్తున్నారు.ఇలా చేయడం ద్వారా తమ సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్తాయని, ఎన్నికల సంఘం కూడా తమ సమస్యలపై రియాక్ట్ అవుతుందని భావించి నిజామాబాద్ జిల్లా రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రైతులు ఇలా ఎన్నికలలో పోటీ చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది.మరి దీనిపై కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube