సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ షూటింగ్ డేట్ రిలీజ్! జులైలో ప్రారంభం

అక్కినేని నాగార్జున కెరియర్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ సోగ్గాడే చిన్ని నాయనా.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో నాగార్జున డబల్ రోల్ చేసాడు.

 Soggade Chinni Nayana Movie Sequel Going To Shoot In July-TeluguStop.com

అందులో ఒకటి బగార్రాజు పాత్ర.నిజానికి సినిమా అంతా బగార్రాజు పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

ఇక ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా బంగార్రాజు టైటిల్ ని నాగ్ అప్పట్లోనే రిజిస్టర్ చేయించాడు.ఇక తరువాత కళ్యాణ్ కృష్ణ అక్కినేని ఫ్యామిలీ కి రారండోయ్ వేడుక చేద్దాం సినిమాతో మరో హిట్ ఇచ్చాడు.

అయితే ఆ తరువాత రవితేజ డేట్స్ సంపాదించి నేల టికెట్ అనే సినిమా తీసి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.దీంతో నాగార్జున అతనిపై పెద్దగా నమ్మకం చూపించలేదు.

అయితే బంగార్రాజు కథని సిద్ధం చేసి నాగ్ కి వినిపించడం ఆ సినిమా కథ నాగార్జునకి నచ్చడంతో దానిని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని జులై నెలలో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నాగార్జున సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.

మరి ఈ సీక్వెల్ బంగార్రాజుతో నాగ్ మళ్ళీ ఎ మేరకు సూపర్ హిట్ కొడతాడు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube