కోడెల కి సత్తెనపల్లిలో అంత సీన్ ఉందా..???

టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్, పార్టీకి మొదటి నుంచీ వెన్నంటే ఉన్న నేత, రాయపాటి తనయుడికి దక్కాల్సిన సీటుని పట్టుబట్టి మరీ రాయపాటికి జలక్ ఇస్తూ సత్తెనపల్లి నుంచీ మరో సారి పోటీ కి బాబు ని ఒప్పించుకుని మరీ రంగంలోకి దూకిన స్పీకర్ కోడెల ఈ సారి గెలుపుపై ధీమా కంటేకూడా తనకి 15 వేల భారీ మెజారిటీ వస్తుందని అంటున్నారు.అసలు కోడెల కి అంత సీన్ ఉందా.

 Speaker Kodela Sivaprasad Rao Participating Form Sattenapalli-TeluguStop.com

కోడెల గెలుస్తారా.గెలిస్తే అంత మెజారిటీ వస్తుందా.

కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుంచీ పోటీ చేయడానికి రంగం సిద్దమయ్యి పోయింది.బాబు కూడా కోడెల కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఈ విషయంపై టీడీపీలో పెద్ద రచ్చె జరిగింది.అయితే కోడెల ఈ దఫా ఓడిపోవడం పక్క అని సొంత సర్వేలు సైతం తేల్చి చెప్పాయి.దాంతో చంద్రబాబు ఆయన్ని లోక్ సభకి పంపాలని అనుకున్నారు కానీ

కోడెల శివప్రసాద్‌ తాను సత్తెనపల్లి నుంచే పోటీ చేయబోతున్నాననీ, ఈ నెల 22న నామినేషన్‌ వేయబోతున్నాననీ ప్రకటించుకోవడంతో ఏమి చేయలేక బాబు మిన్నకున్నారు.

అయితే తన నియోజకవర్గం నుంచీ 15 వేల మెజారిటీ తో గెలుపు ఇస్తానని బల్లగుద్ది చెప్తున్నారు కోడెల.మరి కోడెల కి నిజంగానే అంత భారీ మెజారిటీ వస్తుందా.?? సత్తెనపల్లిలో అంత సీన్ ఉందా.?? అంటే లేదని అంటున్నారు స్థానిక ప్రజలు.గతంలో ఓ ఇంటర్వ్యూ లో తాను సత్తెనపల్లి లో గెలుపు కోసం ఎంత కష్టపడింది చెప్తూనే ఎన్ని కోట్లు ఖర్చు చేశారో కూడా చెప్పి అడ్డంగా బుక్కయిన కోడెల కి అప్పట్లో కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీ కూడా దక్కలేదు.

అప్పట్లో పవన్ తాలూకు ఇమేజ్ , మోడీ వేవ్, విభజన ఎఫెక్ట్ అంతా కలిసోస్తేనే ముక్కి ముక్కి 900 పైగా మెజారిటీ వచ్చింది.దాంతో ఇప్పుడు సత్తెనపల్లి నుంచీ తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కుంటున్న ఆయన గెలుపు సాధ్యం అంతా ఈజీ కాదని అనుకుంటుంటే ఏకంగా 15 వేల మెజారిటీ ఎక్కడి నుంచీ తీసుకువస్తారో ఆయనకే తెలియాలి అంటున్నారు పరిశీలకులు.

మరి కోడెల తన వాగ్ధానం నిలబెట్టుకుంటారా.లేదా అనేది భవిష్యత్తులో తేలిపోనుంది అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube