ఐపీల్ చరిత్ర లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే , ఒక్క పరుగుకి 6.5 లక్షల ధర

భారత క్రికెట్ బోర్డ్ బీసీసీఐ ( BCCI ) ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన బోర్డ్.మరి అలాంటి బోర్డ్ నిర్వహించే ఐపీల్ ఎంత కాస్ట్లీ లీగో అర్థం చేసుకోండి.2008 లో ప్రారంభమైన ఈ ఐపీల్ దాదాపు 11 సీజన్లను ముగించుకొని 12 వ సీజన్ కు వచ్చేసింది.ప్రతి ఐపీల్ టీం ఆటగాళ్లని వేలం లొనే కొంటుంది , ఐపీల్ వేలం లో అత్యధిక ధరకు కొన్న టాప్ 10 ఆటగాళ్లు వీరే

 The Highest Paid Players In The Ipl-TeluguStop.com

1.

యువరాజ్ సింగ్ ( ఢిల్లీ డేర్ డెవిల్స్ ) 2015 – 16 కోట్లు

యువరాజ్ సింగ్ అనగానే మనకి మొదట గుర్తొచ్చేది ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు , ఈ స్టైలిష్ లెఫ్ట్ హాండ్ బ్యాట్స్ మెన్ ని 2015 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 16 కోట్లకు కొనుకుంది , ఐపీల్ వేలం లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు యువరాజ్ .అయితే 2015 లో అతడు ఢిల్లీ తరుపున 14 మ్యాచ్ లు ఆడగా 19.07 సగటుతో కేవలం 248 పరుగులు మాత్రమే చేసాడు లెక్కల్లో చెప్పాలంటే అంటే 6.5 లక్షలకు ఒక పరుగు .2014 లో కూడా యువరాజ్ 14 కోట్లు అప్పటికి అత్యధిక ధర తో బెంగళూర్ జట్టు కొనుకుంది.

2.బెన్ స్టోక్స్ ( పుణె సూపర్ జెయింట్స్ ) 2017 – 14.5 కోట్లు

ఇంగ్లాండ్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని పుణె జట్టు 2017 లో 14.5 కోట్లకు కొనుకుంది.విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడు బెన్ స్టోక్స్ .20 ఓవర్ల ఫార్మాట్ కి సరిపడా చక్కటి అల్ రౌండర్ ప్రదర్శనతో జట్టుని గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు.స్టోక్స్ ని 2018 లో రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు కొనుకుంది.

3.దినేష్ కార్తీక్ ( ఢిల్లీ డేర్ డెవిల్స్ ) 2014 – 12.5 కోట్లు

దినేష్ కార్తీక్ కీపర్ గా బ్యాట్స్ మెన్ గా భారత్ జట్టుకు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు.టీ20 లో మెరుపు వేగం తో స్కోర్ చేయగల సత్తా ఉన్న దినేష్ కార్తీక్ ని 2014 లో ఢిల్లీ 12.5 కోట్లకు కొనుకుంది.2015 లో జరిగిన ఐపీల్ వేలం లో బెంగళూరు జట్టు 10.5 కోట్లకు దినేష్ కార్తీక్ ని తీసుకుంది.

4.జయదేవ్ ఉనత్కట్ ( రాజస్థాన్ రాయల్స్ ) 2018 – 11.5 కోట్లు

భారత యువ బౌలర్ జయదేవ్ ఉనత్కట్ ని రాజస్థాన్ జట్టు 11.5 కోట్లకు తీసుకుంది.ఐపీల్ వేలం లో అత్యధిక పారితోషికం తీసుకున్న బౌలర్ ఇతనే.2019 కోసం జరిగిన వేలం లో రాజస్థాన్ జట్టు 8.40 కోట్లకు తీసుకుంది.

5.గౌతమ్ గంభీర్ ( కోల్ కత్తా నైట్ రైడర్స్ ) 2011 – 11.40 కోట్లు

భారత జట్టుకు తన బ్యాటీంగ్ తో ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ఆటగాడు గౌతమ్ గంభీర్ .ఇతనిని కోల్ కత్తా జట్టు 2011 లో జరిగిన ఐపీల్ వేలం లో 11.4 కోట్ల భారీ మొత్తానికి తీసుకుంది.2011 సమయం లో అదే అత్యధిక ధర.ఇతను కోల్ కత్తా కి కెప్టెన్ గా 6 సీజన్లకు ఉన్నాడు అందులో 2012 ,2014 లో గంభీర్ సారథ్యం లొనే కోల్ కత్తా ఐపీల్ ట్రోఫీ ని గెలుచుకుంది.

6.కె.ఎల్ .రాహుల్ (కింగ్స్ XI పంజాబ్ ) 2018 – 11 కోట్లు

2018 ఐపీల్ కోసం కె ఎల్ రాహుల్ ని పంజాబ్ జట్టు 11 కోట్లకు కొనుకుంది.అతను 2018 సీజన్లో పంజాబ్ తరుపున 649 పరుగులు చేసాడు ఇందులో సెంచరీ తో పాటు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ( 12 బంతుల్లో ) కూడా ఉన్నాయి.

7.రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) 2012 – 9.72 కోట్లు

టీం ఇండియా లో బెస్ట్ ఫీల్డర్ లలో ఒకరైన జడేజా బ్యాట్ తో పాటు బంతి తో కూడా మాయ చేయగలడు.ఇతనిని చెన్నయ్ జట్టు 2012 లో 9.72 కోట్లకు కొనుకుంది.

విరాట్ కోహ్లీ , సచిన్ టెండూల్కర్ , మహేంద్ర సింగ్ ధోని వంటి ఆటగాళ్లు వేలం పాట లోకి ఎప్పుడు రాలేదు .విరాట్ కోహ్లీ ఐపీల్ ప్రారంభం నుండి బెంగళూరు జట్టుకు అడుతున్నాడు , సచిన్ ముంబై కి తప్ప ఏ జట్టుకు ఆడలేదు , ధోని చెన్నై మరియు పుణె జట్లకి ఆడాడు ఈ రెండు సందర్భాల్లో ధోనికి వేలం జరగలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube