కాంచన 3 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన లారెన్స్!

డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా,నటుడుగా తరువాత దర్శకుడుగా మారిన వ్యక్తి రాఘవ లారెన్స్ స్టైల్ సినిమాతో సత్తా చాటాడు.తరువాత తెలుగులో మాస్, డాన్, రెబల్ వంటి సినిమాలని తెరకెక్కించాడు.

 Lawrence Kanchana 3 Release Date Announce-TeluguStop.com

అదే సమయంలో హర్రర్ జోనర్ లో ముని సినిమా తో మొదటి సారి ప్రేక్షకులని నవ్విస్తూ, భయపెట్టాడు.ఇక దానికి సీక్వెల్ గా తెరకెక్కిన కాంచన, గంగ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.

దీంతో లారెన్స్ ఈ హర్రర్ కామెడీ సిరిస్ లో నాలుగో సినిమాని కూడా రెడీ చేసాడు.

కాంచన 3గా తెరకెక్కిన ఈ సినిమాలో లారెన్స్ కి జోడీగా తమిళ బిగ్ బాస్ భామ ఒవియా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫినిష్ చేసిన లారెన్స్ ఆ మధ్య అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు లారెన్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేసారు.

కాంచన సిరిస్ లో వస్తున్నా ఈ సినిమా ప్రేక్షకులని మళ్ళీ ఎ స్థాయిలో భయపెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube