ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న8 ప్రశ్నలకు సమాధానాలు ఇదుగో

రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అది గొప్పగా, భారీగా, విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సంవత్సరం క్రితం ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో వదిలారు.

 Rrr Movie Team Superb Answers To Media Questions-TeluguStop.com

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో రాజమౌళి ఉన్న ఫొటో విడుదల చేశారు.ఆ సమయంలో సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు.

ఎవరు ఏమీ చెప్పలేదు.అప్పటి నుండి మొదలుకుని నిన్నటి వరకు అంటే సంవత్సరంకు పైగా ఆ సినిమా గురించి, పాత్రల గురించి, హీరోల గురించి, విలన్‌ గురించి, కథ గురించి, నేపథ్యం గురించి ఎన్నో ఎన్నో పుకార్లు, ప్రశ్నలు వచ్చాయి.

ఆ ప్రశ్నలన్నింటికి దాదాపుగా చిత్ర యూనిట్‌ సభ్యులు సమాధానం చెప్పారు.

వాటిలో కీలకమైన ప్రశ్నలు ఇవే.

1.ఈ చిత్రం కథ నేపథ్యం ఏంటీ?
స్వాతంత్య్రంకు పూర్వ కథ.

2.హీరోల పాత్రలు ఏంటీ?
ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతరామరాజు పాత్ర, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్ర.

3.హీరోయిన్స్‌ ఎవరు?
బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ (చరణ్‌), హాలీవుడ్‌ బ్యూటీ డైజీ అడ్గార్జియోన్స్‌

4.టైటిల్‌ ఏంటీ?
వర్కింగ్‌ టైటిల్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫైనల్‌ టైటిల్‌

5.ఈ చిత్రం బడ్జెట్‌ ఎంత?
350 కోట్ల నుండి 400 కోట్లు

6.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది?
జులై 30, 2020

7.బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నాడా?
అవును, ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నాడు(విలన్‌గా అయితే కాదు)

8.రెండు పార్ట్‌లుగా వస్తుందా?
ఎట్టి పరిస్థితుల్లో ఇది రెండు పార్ట్‌లుగా తీయడం లేదు.ఈ కథ ఒక్క పార్ట్‌కు తగ్గట్లుగా ఉందని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube