రాజశేఖర్‌ నిర్ణయంను తప్పుబడుతున్న విశ్లేషకులు... ఆ పిచ్చి పని చేస్తే మొదటికే మోసం అంటూ హెచ్చరిక

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ అనే చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నాడు.ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా రాజశేఖర్‌ దశాబ్దపు ఎదురు చూపులకు బ్రేక్‌ వేసింది.

 Hero Rajasekhar About Psv Garuda Vega Movie Sequel-TeluguStop.com

మరి కొంత కాలం ఆయన హీరోగా కొనసాగేందుకు బూస్ట్‌ను ఇచ్చింది.అలాంటి సినిమాకు ఇప్పుడు రాజశేఖర్‌ సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నాడు.

గరుడవేగ అనేది ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ మూవీ.ఆ మూవీ హిట్‌ అవ్వడం ఆశ్చర్యకర విషయం.

తెలుగు ప్రేక్షకులు గరుడవేగ చిత్రం సక్సెస్‌తో విభిన్నమైన తమ టేస్ట్‌ను మరోసారి చూపించారు.అయితే ప్రతిసారి అలాంటి సినిమాలు హిట్‌ అవుతాయనుకుంటే పొరపాటు నిర్ణయం అవుతుంది.

ఇటీవల మా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచిన రాజశేఖర్‌ సంతోషంగా మాట్లాడుతూ తాను ప్రస్తుతం చేస్తున్న కల్కి మూవీ తర్వాత గరుడవేగ చిత్రానికి సీక్వెల్‌ చేస్తానంటూ ప్రకటించాడు.సీక్వెల్‌కు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తుంది.

ఆయన సన్నిహితులు ప్రస్తుతం కథా చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.మొదటి పార్ట్‌ మాదిరిగానే రెండవ పార్ట్‌ కూడా భారీ బడ్జెట్‌తో తీస్తానంటూ రాజశేఖర్‌ ప్రకటించాడు.

రాజశేఖర్‌ గరుడవేగ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నా కూడా ఆ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టలేదు.ఎందుకంటే ఆ సినిమా పెట్టుబడి చాలా ఎక్కువ కనుక.రాజశేఖర్‌ మార్కెట్‌కు అనుగుణంగా 10 నుండి 15 కోట్ల వరకు పెడితే పర్వాలేదు.కాని మరీ ఎక్కువ పెడితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

గరుడవేగను ప్రవీణ్‌ సత్తారు కనుక మంచిగా తీశాడు, మరే దర్శకుడు అయినా అలా తీస్తాడన్న నమ్మకం లేదు.అందుకే సీక్వెల్‌ ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube