ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయా ...? అధికారుల ఆందోళనకు కారణం ఏంటి ?

ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.ఏపీలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ వార్తలు రావడం సంచలనంగా మారింది.

 Ap Officers Phone Tapping Isuue-TeluguStop.com

ముఖ్యంగా కీలకమైన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని రహస్యంగా రికార్డు చేస్తున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది.ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ విధమైన కార్యకలాపాలు ఎక్కువయ్యాయని కీలకమైన కొంతమంది అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా కీలకమైన కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టీడీపీ భావిస్తోందట.

దీనిలో భాగంగానే కీలకమైన సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారు అనే అనుమానంతో ఈ నిఘా ఏర్పాటు చేసినట్టు అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇంతకు ముందే అంచనాకు వచ్చారని , అధికారుల అభిప్రాయాలపై టీడీపీ వివరాలు సేకరించిందని, ఆ వివరాలను బట్టి వైసీపీకి ఎలా సహకరిస్తున్నారో తెలుసుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోందని ఉన్నతాధికారులు చెప్పుకొస్తున్నారు.

తమ ఫోన్ లతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో నిఘా విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 18 తరువాత తామంతా ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులకు సీనియర్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.అయితే ఇదంతా కేవలం వట్టి అపోహ మాత్రమేనని, ఎవరి ఫోన్ లు మీద ఎటువంటి నిఘా ఏర్పాటు చేయలేదు అని టీడీపీకి అనుకూలంగా ఉండే మరికొంతమంది అధికారులు వాదిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube