ఆన్‌లైన్‌లో చూసి నార్మల్‌ డెలవరీకి యువతి ప్రయత్నం... చివరకు రక్తపు మడుగులో

పెరుగుతున్న టెక్నాలజీని అన్ని రకాలుగా వాడేసుకోవాలని కొందరు భావిస్తూ ఉన్నారు.ఇంటర్నెట్‌ సేవలు పెరిగిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా ఇంటర్నెట్‌లో తెలుసుకునేందుకు జనాలు సిద్దం అవుతున్నారు.

 Woman In Up Watches Video On How To Deliver Baby Alone Dies-TeluguStop.com

యూట్యూబ్‌ మరియు గూగుల్‌ వంటి ఆన్‌ లైన్‌ పోర్టల్స్‌లో గుండు సూది నుండి విమానం తయారీ వరకు ఎలా చేయాలో అన్ని విషయాలు ఉంటున్నాయి.అందుకే సొంత ప్రయోగాలు చేసి కొందరు అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూనే ఉండటం చూశాం.

ఆమద్య మన దేశంలో ఒక జంట యూట్యూబ్‌లో చూసి నార్మల్‌ డెలవరీకి ప్రయత్నించిన వార్తలు వైరల్‌ అయిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే తరహాలో మరో వార్త సంచలనంగా నిలిచింది.

ఈసారి కూడా మనదేశంలోనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువతి యూట్యూబ్‌లో చూసుకుంటూ నార్మల్‌ డెలవరీ అయ్యేందుకు ప్రయత్నించింది.ఒంటరిగా ఉన్న ఆమె అధిక రక్తస్రావం అవ్వడంతో మృతి చెందింది.

ఈ సంఘటనకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.ఆమె మృతి ఇతరులకు ఒక గుణపాఠంగా, హెచ్చరికగా ఉండాలనే ఉద్దేశ్యంతో యూపీ పోలీసులు మరియు ప్రజా సంఘాల వారు ఆ విషయాల పట్ల అవగాహణ కల్పిస్తూ వస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌లోని బహ్‌రాయిచ్‌ అనే చిన్న గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి పోటీ పరీక్షలకు సిద్దం అవుతూ ఉంది.ఆమె ఇటీవలే గోరఖ్‌పూర్‌లోని ఒక అద్దె ఇంటికి మారింది.నెలలు నిండిన ఆమెపై జాలి చూపి అద్దెకు ఇల్లు ఇచ్చారు.అప్పటికే నెలలు నిండిన ఆమె కడుపు నొప్పి రావడంతో ఎవరికి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వకుండా యూట్యూబ్‌లో వీడియోస్‌ చూస్తూ తనకు తానే ప్రసవం చేసుకోవాలని భావించింది.

అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంది.అయితే అధిక రక్తస్రావం అవ్వడం మొదలైంది.ఆమె రక్తం బయటకు వెళ్లి, బయట వారు గుర్తించేంతగా రక్తస్రావం అయ్యింది.దాంతో ఆమె మృతి చెందింది.

ఆ యువతి తల్లిదండ్రులు గర్బంకు కారణం ఎవరు అనే విషయాన్ని చెప్పలేదు.దాంతో కేసు నమోదుకు పోలీసులు సిద్దపడలేదు.

అయితే ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube