79 ఏళ్లుగా తిండి, నీళ్లు ముట్టలేదు... ప్రముఖ వైధ్యులు, అబ్దుల్‌ కలామ్‌ వంటి వారు కూడా నిర్ధారించారు

ఒక మనిషి తిండి లేకుండా వారం పది రోజుల వరకు బతికి ఉండగలడేమో కాని నీరు లేకుండా మాత్రం కనీసం ఒకటి రెండు రోజులు కూడా ఉండలేడు.తిండి, నీరు లేకుండా మూడు నాలుగు రోజులు జీవించడం అంటే చాలా గొప్ప విషయం.

 Prahlad Jani A Man Without Food And Water For Over 79 Years-TeluguStop.com

కాని ఒక బాబా మాత్రం రోజులు కాదు, నెలలు కాదు ఏకంగా 79 ఏళ్లుగా తిండి, నీరు లేకుండా జీవించేస్తున్నాడు.ఈయన మొదట అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని అంతా భావించారు.

తిండి, నీరు లేకుండా ఎలా మనిషి బతుకుతాడు అని అంతా అనుకున్నారు.కాని అతడిని వైధ్యులు రకరకాలుగా పరీక్షించారు.

ఒక రహస్యపు ప్రదేశంలో చుట్టు సీసీ కెమెరాలు పెట్టి మరీ ఈయన ఏమైనా ఆహారం తీసుకుంటున్నాడా అనే విషయాన్ని ఏకంగా 20 రోజుల పాటు పరీక్షించారు.ఆ 20 రోజులు కూడా ఆయన ఏం తీసుకోకుండానే ఉన్నాడు.

కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా ఈయన ఎలా జీవిస్తున్నాడు అని దేశ విదేశాలకు చెందిన వైధ్యులు ఆయనపై ప్రయోగాలు చేశారు.చివరకు మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం కూడా ఈ బాబాపై పరిశోదన చేశారు.

ఈయన ఎలా ఇంత కాలం బతుకుతున్నా, ఈయన మాదిరిగా అంతా బతకవచ్చా అనే విషయమై పెద్ద ఎత్తున పరిశోదనలు జరుగుతున్నాయి.దాదాపు 80 ఏళ్లుగా తిండి నీరు తాగకుండా జీవితం అంటే ఇప్పటికి అసాధ్యం అనిపిస్తుంది కదా… ఈ విషయమై బాబా ఏమంటాడో తెలుసా కేవలం ధ్యానం, శ్వాస తోనే తాను బతికేస్తున్నాను అంటాడు.

గుజరాత్‌ మోహసానా జిల్లా చరోడ్‌ అనే చిన్న గ్రామంలో ఉండే ఈ 90 ఏళ్ల బాబా పేరు ప్రహ్లద్‌ జానీ.ఈయన పదేళ్లు ఉన్నప్పటి నుండే ఆహారం, నీరు తీసుకోవడం మానేశాడు.2010వ సంవత్సరంలో పలు విభాగాల ప్రభుత్వ అధికారులు ప్రహ్లాద్‌ జానీని తమ ఆధీనంలోకి తీసుకుని 20 రోజుల పాటు పరిశోదనలు చేశాడు.ఎప్పటిలాగే ఆయన ఉన్నాడు.

ఆయన ఉండే కుటీరంలోని చెట్లను కూడా శాస్త్రవేత్తలు పరీక్షించారు.శ్వాస తీసుకుని ఆయన ఎలా జీవిస్తున్నాడో అని తెలుసుకునేందుకు చెట్లపై పరిశోదనలు కూడా ఫలితంను ఇవ్వలేదు.

ఏం తీసుకోకుండా ఎప్పుడు కూర్చుని ఈ బాబా ఉండరు.ఎప్పుడు ఏదో ఒక పని చేస్తారు.ఈ వయసులో కూడా పదలు కిలోమీటర్ల మేరకు ఆయన నడుచుకుంటూ వెళ్తాడు.వందల కిలోమీటర్లు నడిచిన చరిత్ర, రికార్డు ఉంది.ఈయన రహస్యంను తెలుసుకునేందుకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలం అయ్యారు.ఆయన మాత్రం తనను శ్వాస మరియు ద్యానం మాత్రమే బతికిస్తున్నాయని చెబుతున్నాడు.

ఆయన జీర్ణ వ్యవస్థ మరియు కడుపులోని అన్ని రకాల క్రియలు మామూలు మనుషులకు జరిగినట్లుగానే జరుగుతున్నాయి.తిండి, నీరు లేకుండా అవి ఎలా జరుగుతున్నాయో వైధ్య నిపుణులకు అంతుపట్టడం లేదు.

ఈ బాబాను కొందరు దైవాంశ సంభూతుడు అంటూ చెబుతున్నారు.అందుకే ఆయనకు తిండి, నీరు అక్కర్లేదు అంటున్నారు.

ఈ బాబా గురించి అందరు తెలుసుకునేలా షేర్‌ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube