ఎంపీ సీటా ? మాకొద్దు బాబోయ్

ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఓ వింత పరిస్థితి ఎదురవుతోంది.పార్టీ తరపున ఎంపీ టికెట్ ఇస్తామని పోటీ చేయాలని కోరుతున్నా మాకొద్దు అంటే మాకు వద్దు అంటూ వెనకడుగు వేస్తున్నారు.

 Tdp Leaders Denied Mp Tickets-TeluguStop.com

తమకు ఎమ్యెల్యే సీటు ఇస్తే చాలు అంటూ అధినేతకు తేల్చి చెప్పేస్తున్నారు.పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను పిలిచి పోటీ చేయాలని చెబుతున్నా వారు మాత్రం ససేమీరా అంటూ పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారు.

మొన్నటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉన్నా ఏపీలో ఆ పార్టీ గాలి వీస్తున్నట్టు సర్వేలు తేల్చేయడంతో ఆ పార్టీకి ఇబ్బంది తప్పింది.ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడం, నామినేషన్ స్వీకరణ గడువు దగ్గరకు వస్తుండడంతో టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.

ముఖ్యంగా ఎనిమిది లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు.విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం ఏలూరు, బాపట్ల, ఒంగోలు మొదలైన చోట్ల పోటీ చేసేందుకు ఎంపీ అభ్యర్థులు ముందుకు రావడం లేదు రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని అధినేతకు స్పష్టంగా చెప్పేయడంతో అక్కడ ఎవరిని దింపాలనే ఆలోచనలో బాబు ఉన్నాడు.

ఇక్కడ భాస్కరరావు అనే అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నా ఇంకా ఎవరైనా బలమైన నాయకుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్నారు.ఏలూరులో సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు ఈ సారి కైకలూరు నుంచి అసెంబ్లీకి వెళ్లాలని చూస్తున్నాడు.

ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిద్ధ రాఘవరావు బరిలోకి దింపాలని ఆలోచనతో ఆయన పేరు ప్రతిపాదించగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా పోటీ చేయలేనని చెప్పేసాడు.నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు ఆయన మాత్రం సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చెప్పాడు.అలాగే విశాఖ ఎంపీగా పోటీ చేయాలంటూ గంటా శ్రీనివాసరావు అనేక రకాలుగా ఒత్తిడి తెస్తున్నా ఆయన ఆయన మాత్రం అసెంబ్లీకే వెళ్తానంటున్నాడు.నరసాపురం లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు ఎవరు కనిపించడం లేదు.

మొన్నటి వరకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరిగిన రఘురామకృష్ణంరాజు వైసీపీలోకి వెళ్లడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది.ఈ నేపథ్యంలో పితాని సత్యనారాయణ, తోట సీతారామ లక్ష్మి, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా వారు ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎవరిని దించాలా అన్న ఆలోచనలో బాబు ఉన్నాడు.

మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube