ఈ-బిజ్ భాగోతాలు బట్టబయలు చేసిన సైబరాబాద్ పోలీసులు!

ఈ మధ్యకాలంలో ఇండియాలో మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల మోసాలు ఎక్కువైపోయాయి.చైన్ లింక్ బిజినెస్ అంటూ నిరుద్యోగులని మోసగించి, లక్షలు సంపాదిన్చుకోవచ్చని మొదటిగా మీరు ఇంత మొత్తం డిపాజిట్ చేసిన తర్వాత మీ క్రింద మరి కొంత మందిని చేర్చుకుంటే మీకు బోనస్ లు వస్తాయని అలాగే మీ సంపాదన రెట్టింపు అవుతుందని నమ్మించి, వారితోనే లబ్దిదారులతోనే ప్రచారం చేయించుకొని సొమ్ములు వెనకేసుకుంటున్న కేటుగాల్ల భాగోతాలని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

 Cyberabad Police Crack On Online Multi Level Marketing Company Scam-TeluguStop.com

ఇప్పటికే చాలా కంపెనీలని గోల్ మాల్ లకి తెరదించిన సైబరాబాద్ పోలీసులు మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ మోసాలని బయట పెట్టారు.ఈ-బిజ్ అనే కంపెనీ ఇలా మల్టీ లెవల్ మార్కెటింగ్ లో భారీ కుంభకోణంకి తెరతీసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

సుమారు వెయ్యి కోట్ల కుంభకోణంకి పాల్పడిన ఈ కంపెనీని చెందిన ఒక డైరెక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు.ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా ఈ లెర్నింగ్, ప్రమోటింగ్, ప్రోడక్ట్ సేల్స్ వంటి స్క్రీమ్స్ పెట్టిన ఈ సంస్థ ఒక్కో వ్యక్తి నుంచి జాయినింగ్ కోసం 16 వేల వరకు వసూలు చేస్తుంది అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలియజేసారు.

ఈ కంపెనీలో దేశ వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది చేరారని తెలియజేసారు.దీనిపై ఓ స్టూడెంట్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి కంపెనీ ప్రతినిధిని అదుపులోకి తీసుకున్నామని తెలియజేసారు.

అలాగే కంపెనీకి చెందిన 70 కోట్ల రూపాయిలి ఫ్రీజ్ చేసామని, కంపెనీ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సజ్జనార్ తెలియజేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube