తన ఓటు తొలగించాలని దరఖాస్తు చేస్తున్న వైసీపీ అధినేత జగన్! ఇదో విడ్డూరం!

మరో నెల రోజులో ఏపీలో ఎన్నికల జరగనున్నాయి.వైసీపీ పార్టీ అధినేత జగన్ రానున్న ఎన్నికలలో తన పార్టీ మెజార్టీ సీట్లు సంపాదిస్తే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటాడు.

 Ys Jagan Apply To Election Commission To Remove His Vote-TeluguStop.com

ఇక జగన్ చిరకాల కల కూడా ముఖ్యమంత్రి పదవి.దాని కోసం జగన్ పెద్ద రాజకీయ పోరాటమే చేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితిలో లివెందులలో తన ఓటు తొలగించాలని కోరుతూ జగన్ స్వయంగా ఎన్నికల కమిషన్ కి ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకుంటాడు అంటే ఎవరైనా నమ్ముతారా.కాని నమ్మాల్సిందే.

జగన్ పేరుతోనే తన ఓటు తొలగించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు వెళ్ళడం ఇప్పుడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.ఈ విషయాన్ని కడప ఎన్నికల అధికారి కూడా ద్రువీకరించాడు.

గత కొద్ది రోజులుగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తొలగింపు కుట్ర కోణంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.

అధికార పార్టీ ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా వైసీపీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేసిందని ఆ పార్టీ ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేసింది.

దీంతో హడావిడిగా తేరుకున్న అధికార పార్టీ టీడీపీ వైసీపీ మీద కూడా తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు మొదలుపెట్టారు.అయితే ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని వెళ్ళిన దరఖాస్తులలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు, ఆ పార్టీలో వున్నా మాజీ ఎమ్మెల్యేలు కూడా వుండటం విశేషం.

ఇదిలా వుంటే తాజాగా వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఓటు తొలగించాలని వెళ్ళిన దరఖాస్తులో వుండటం గమనార్హం.అది కూడా జగన్ స్వయంగా దరఖాస్తు చేసినట్లు వుండటం ఇప్పుడు దీని వెనుక ఎ స్థాయిలో కుట్ర, సైబర్ క్రైమ్ జరిగిందో స్పష్టంగా చెప్పొచ్చు.

దీనిపై ఇప్పటికే కడప ఎన్నికల అధికారి జగన్ కి నోటీసులు పంపించి వివరణ తీసుకున్న తర్వాత దీనికి కారణం అయినవారిపై చర్యలు తీసుకుంటాం అని కూడా తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube