ఆంధ్రా రాజకీయాలలో మేమున్నాం అంటున్న కార్పోరేట్ విద్యా సంస్థలు!

ఏపీ రాజకీయాలలో మునుపెన్నడు లేని విధంగా కార్పోరేట్ విద్యా సంస్థల అధినేతలు కూడా తమ సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు.ఇంతకాలం రాజకీయాలకి దూరంగా విద్యా వ్యాపారంలో బిజీగా వున్న వారు తమ వ్యాపార లక్ష్యాలలో భాగంగా రాజకీయాలలో కూడా భాగం అవుతున్నారు.

 Educational Academy Managing Directors In Ap Politics-TeluguStop.com

కోట్లు ఖర్చు పెట్టె సత్తా వుండటంతో మేము కూడా ఎన్నికల బరిలో నిలబడతాం అని ముందుకొస్తున్నారు.అందుకు తగ్గట్లుగానే టీడీపీ, వైసీపీ పార్టీలు కార్పోరేట్ విద్యాసంస్థల అధిపతులకి తమ పార్టీలలో స్థానం కల్పించాయి.

ఇలా పార్టీల తీర్ధం పుచ్చుకున్న వారిలో కొందరు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు తేల్చుకోవడానికి ఎన్నికల బరిలో కూడా దిగుతున్నారు.అలా దిగుతున్న వారిలో నారాయణ విద్యాసంస్థ అధినేత నారాయణ టీడీపీ నుంచి, అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి, విజ్ఞాన్ సంస్థల అధినేత క్రిష్ణదేవరాయులు వైసీపీ నుంచి, నలంద వరప్రసాద్ వైసీపీ నుంచి ఎన్ఆర్ఐ సంస్థల అధినేత రాజేంద్రప్రసాద్ టీడీపీ నుంచి పూజిత విద్యాసంస్థల అధినేత హరిప్రసాద్ టీడీపీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు.

మరి వీరిలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube