మీ ఓటు గల్లంతయ్యిందేమో ఇప్పుడే చెక్‌ చేసుకోండి... ఈ సమయంలో అత్యంత ఉపయోగదాయకమైన విషయం

దేశంలో ఎన్నికల సందడి మొదలైంది.పార్లమెంటు ఎన్నికలకు నిన్న నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు ఉందా లేదా అనే విషయంలో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.

 Check Your Vote With Voter Help Line App-TeluguStop.com

ఇటీవల ఏపీలో ఓట్లు పోయాయని, తెలంగాణలో ఓట్లు లక్షల్లో మిస్‌ అయ్యాయి అంటూ ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో త్వరలో ఓటు వేయాల్సిన వారు తమ ఓటు ఉందో లేదో అనే సందోహంతో ఉన్నారు.

తీరా ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో మీ ఓటు లేదు అంటే ఆగం అవ్వక తప్పదు.అందుకే ముందుగానే ఓటు ఉందో లేదో అనే విషయాన్ని తెలుసుకోండి.

ఓటర్లకు సాయంగా ఉండేందుకు ఎన్నికల కమీషన్‌ ఎప్పుడు అండదండగా ఉంటూనే ఉంది.ఎన్నికల కమీషన్‌ చాలా వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా, తప్పకుండా వినియోగించుకునేందుకు కృషి చేస్తోంది.

అందులో భాగంగానే తాజాగా ఎన్నికల కమీషన్‌ కొత్త యాప్‌ను తీసుకు వచ్చింది.ఈ యాప్‌లో ఓటరు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును చూసుకోవడంతో పాటు, ఓటును తొలగించడం, స్థానం మార్పిడి మరియు పేరు మార్పిడి వంటి సాయాలు పొందవచ్చు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మీ ఓటు ఉందో లేదో అనే విషయాన్ని ‘ఓటరు హెల్ప్‌ లైన్‌’ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో మీ వివరాలను తెలుసుకోవచ్చు.మీ ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఆ యాప్‌లో సెర్స్‌లో మీ ఓటర్‌ కార్డు నెంబర్‌ లేదా మీ నియోజక వర్గంకు వెళ్లి అందులో మీ వివరాలను సెర్చ్‌ చేసుకునే అవకాశం ఉంది.అందులో కనిపిస్తే మీకు ఓటు ఉన్నట్లుగా నిర్ధరణ అయినట్లు.

అందులో లేదు అంటే వెంటనే ఫామ్‌ 6 ఉంటుంది, దాంతో మీరు మళ్లీ ఓటరుగా నమోదు అవ్వవచ్చు.ఇక ఫామ్‌ 7తో మీ ఓటును తొలగించే అవకాశం ఉంది.

ఫామ్‌ 8తో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వారు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి.అప్పుడే మీరు మీ బాధ్యతను నిర్వర్తించినట్లవుతుంది.

ఈ ఉపయోగకర విషయాన్ని స్నేహితులతో షేర్‌ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube