తెలంగాణలో వరుసగా ఎన్నికల హడావిడి!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఎన్నికల ప్రహసనం ఉండబోతుంది.ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే పంచాయితీ ఎన్నికల తెలంగాణ షురూ అయ్యాయి.

 Continuous Elections In Telangana-TeluguStop.com

అవి ముగిసిన కొద్ది నెలల్లోనే మరల తాజాగా లోక్ సభ ఎన్నికల మొదలు కాబోతున్నాయి.ఇక లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు ఎంపిటిసి, జెడ్పీటిసి ఎలక్షన్స్ జరగనున్నాయి.

వీటి తర్వాత మందల అధ్యక్ష, జిల్లా అధ్యక్షా ఎన్నికలు జరుగుతాయి.వీటి తర్వాత సహకార సంఘాల ఎన్నికలకి తెలంగాణ వేదిక కానుంది.

ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం జులై నెల వరకు తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొని వుంటుంది.ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో గెలిచి అధికారంలోకి వచ్చ్చిన టీఆర్ఎస్ పార్టీ పంచాయితీ ఎన్నికలలో కూడా సత్తా చాటింది.

ఇక పార్లమెంట్ ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం వుందని సర్వేలు చెబుతున్నాయి.ఇదే లెక్కన చూసుకుంటే జిల్లా, మండల ఎలక్షన్స్ తో పాటు, మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ జోరుని ఆపడం కష్టం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube