రేవంత్ అలకకు కారణం ఏంటి ..? కాంగ్రెస్ కు దూరం అవుతున్నాడా ?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్నారా అనే అనుమానాలు కొద్దిరోజులుగా బలపడుతున్నాయి.ఈ వాదనలకు బలపడేలా రాహుల్ గాంధీ కి ఆయన దూరం జరగడం, తెలంగాణకు రాహుల్ వచ్చినా ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించకపోవడం, తెలంగాణాలో లోక్ సభ తొలి ఎన్నికల ప్రచార సభకు డుమ్మా కొట్టడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

 Why Revanth Reddy Avoiding Rahul Gandhi Meeting-TeluguStop.com

ఇదే విషయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు పార్టీలో పెద్ద చర్చగా మారింది.

లోక్ సభ ఎన్నికల్లో ఆయన యాక్టివ్ రోల్ పోషిస్తారా అనేది అనుమానంగా మారింది.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ కి ఎక్కడలేని ప్రాధాన్యం కల్పించింది.

ప్రత్యేకంగా హెలికాఫ్టర్ కూడా ఇచ్చారు.ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని తీవ్రంగా నిరాశపరిచాయి.తాను ఓడిపోవడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే.ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమీ దూరం జరగడం లేదు.

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు.అయితే.

మీడియాతో మాత్రం నేరుగా మాట్లాడటం లేదు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడిన జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో.ఆయన ఎందుకు రాహుల్ సభకు హాజరు కాలేదన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు.

ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యతే ఇవ్వాలని, తనను పార్లమెంట్ కు పోటీ చేయాలనీ పార్టీ అధిష్టానమే కోరాలని రేవంత్ భావిస్తున్నాడట.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలని రేవంత్ డిమాండ్ మొదలుపెట్టాడు.అలా కానీ పక్షంలో కాంగ్రెస్ కు దూరం జరగాలని రేవంత్ డిసైడ్ అయ్యాడనే టాపిక్ ఇప్పుడు పార్టీలో వినిపిస్తోంది.అయితే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడితే ఏ పార్టీలోకి వెళ్తారనేది సందేహంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube