హెచ్ -4 కొనసాగించండి..భారతీయుల అభ్యర్ధన...!!

అమెరికా ప్రభుత్వం గత కొంత కాలంగా వీసాల విధానంపై అనుసరిస్తున్న తీరు ఎంతో మంది ఎన్నారైలని ఇబ్బందులకి గురిచేస్తోంది.ముఖ్యంగా భారతీయ ఎన్నారైలకి ఈ పరిస్థితులు ఎంతో ఇబ్బంది కరంగా మారాయి.

 A Petition Launched On The White House Website To Save H4 Ead-TeluguStop.com

హెచ్ -1 బీ వీసా దారులు జీవిత భాగస్వాములకు పని చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే హెచ్ -4 వర్క్ పర్మిట్ వీసా విధానాన్ని ఎత్తేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.దాంతో

ఆందోళన చెందిన భారత ఎన్నారైలు.

అనేక మంది ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఓ పిటిషన్ ని శ్వేత సౌధం వెబ్సైటు లో వేశారు.ఎంతో మంది భారత ఎన్నారైలు కలిసి ఒక్కటిగా ఏర్పడుతూ ఈ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది.

అయితే అమెరికాలో ఉంటున్న భారత ఐటీ నిపుణులు అందరిని ఒక దరికి చేర్చే ఐటీ ప్రో అలయెన్స్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ ఈ పిటిషన్‌ వేసినట్లుగా తెలుస్తోంది.సుమారు లక్ష మంది నేరుగా అర్ధించిన పక్షంలో అమెరికన్ ప్రభుత్వం ఈ పిటిషన్ పై స్పందించి తీరాల్సిందే.అయితే ఇప్పటి వరకూ ఈ పిటిషన్ కి అనుకూలంగా 43,332 మంది సంతకాలు చేయడం జరిగిందని సంస్థ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube