భద్రతా దళాలు ఫోటోలు ఎన్నికల ప్రచారం కోసం వాడొద్దు! ఎలక్షన్ కమిషన్!

ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు కొత్త రకం వ్యూహాలని మొదలు పెట్టాయి.దేశంలో ఉగ్రదాడులు జరిగిన, లేదంటే ఉగ్రవాదులపై భద్రతా దళాలు దాడులు చేసి నియంత్రించిన వాటి చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ఎత్తులకి, విమర్శలకి తెరతీస్తున్నాయి.

 Stop Using Photos Of Armed Forces In Election Campaigning-TeluguStop.com

అప్పట్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ని బీజేపీ పార్టీ తమ రాజకీయాల కోసం వాడుకుంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది.మళ్ళీ తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో బీజేపీని విమర్శించడానికి ఉపయోగించుకుంది.

అయితే బీజేపీ పార్టీ కూడా తాము ఈ రాజకీయాలలో ఎ మాత్రం తక్కువ కాదు అన్నట్లు రక్షణ శాఖ పరిధిలో జరిగే ఉగ్రవాద పోరుని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది, బీజేపీ పార్టీ నేతలు కూడా సర్జికల్ దాడులు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అంటూ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది.

భద్రతా దళాలు పోరాటాలని రాజకీయ పార్టీలు తమ సొంత చేసుకొని రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తే సహించం అని, అలాగే భద్రతాదళాలు ఫోటోలు కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఉపయోగించుకోకూడదు అని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube