పార్టీపై బాబు పట్టు కోల్పోతున్నాడా ? ఈ తిరుగుబాట్లు ఏంటి ?

తెలుగుదేశం పార్టీలో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది.ఇప్పటివరకు అధినాయకుడి మాటే వేద మంత్రంగా పాతీస్తూ వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మాత్రం తిరుగుబావుటా ఎగురవేస్తూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనిపించలేదు.2014 ఎన్నికల ముందువరకు టీడీపీలో ఏ నిర్ణయం అయినా చంద్రబాబు మాత్రమే తీసుకునే వారు మిగతావారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే వారు .అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు.బాబు మాటే ఎప్పుడూ మేము వినాలా ? మా మాట బాబు వినడా అన్నట్టు కొంతమంది పార్టీ సీనియర్లు ధిక్కార స్వరం వినిపిస్తూ బాబుకే చుక్కలు చూపిస్తున్నారు.

 Tdp Leader Mullapudi Bapiraju To Quit Tdp-TeluguStop.com

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇప్పటివరకు బాబు ఎంపిక చేసిన అభ్యర్ధే ఫైనల్ అన్నట్టు ఉండేది.బాబు అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఏ నియోజకవర్గంలోనూ టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఎలాంటి సమావేశాలు పెట్టకూడదు అంటూ చంద్రబాబు నాయుడు షరతులు కూడా విధించేవారు.

అయితే ఇప్పడు ఆ పరిస్థితి పార్టీలో కనిపించడంలేదు.ఇప్పటికే నాలుగైదు జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసాడు.కాకపోతే ఈ జిల్లాలన్నింటిలోనూ ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా టిక్కెట్లు ఆశించి నిరాశ చెందిన నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి బాబు ఎంపిక చేసిన అభ్యర్థికి వ్యతిరేకంగా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు.ఈ విధంగానే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన సీనియర్ నాయకుడు ముళ్ళపూడి బాపిరాజు చంద్రబాబును బహిరంగంగానే ధిక్కరించడం స్టార్ట్ చేయడం పార్టీలో పెద్ద చర్చగా మారింది.

ఇప్పటివరకు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తనను కాదని ఈలి నానికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.దీనిలో భాగాంగానే తన అనుచరులతో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించారు.ఈ విషయం పసిగట్టిన బాబు ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా మాట వినేలా కనిపించకపోవడంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలనీ పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు.ఇప్పట్లో ఈ అలజడి చల్లారేలా కనిపించడంలేదు.

ఇప్పుడు బాపిరాజు బాటలో టికెట్లు దక్కనివారు పయనించేందుకు సిద్ధం అవుతుండడం బాబు లో కలవరం పెంచుతోంది.ఇటువంటి వ్యవహారాల్ని ఆదిలోనే తుంచేయకపోతే పార్టీ మీద ఆ ఎఫెక్ట్ గట్టిగా పడి మొదటికే మోసం వస్తుంది అనే భావనలో ఆయన ఉన్నాడు.

ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో పార్టీపై బాబు పట్టు జారుతుందా అనే అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube