మీ అమ్మగారు ఇచ్చారు గాని నువ్వేం ఇచ్చావు... మీ అమ్మను చూసి ఓటు వేయాలా?

టాలీవుడ్‌ ‘మా’ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.శివాజీ రాజా ప్యానల్‌ మరియు నరేష్‌ ప్యానల్స్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్న విషయం తెల్సిందే.

 Comedian Prudhvi Raj Comments On Naresh And Vijaya Nirmala-TeluguStop.com

ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ ఎన్నికలకు పబ్లిసిటీ కల్పించారు.మామూలుగా అయితే మా ఎన్నికల గురించి మీడియాలో ఇంత స్థాయిలో కవరేజీ ఉండేది కాదు.

కాని ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ మీడియా దృష్టిని ఆకర్షించాడు.తాజాగా నరేష్‌ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి మా ను మార్చేస్తాను అంటూ చెబుతున్నాడు.

మా అమ్మగారు విజయనిర్మల మా కు చాలా చేశారు.ఆమె ఎంతో ఆర్థిక తోడ్పాటును అందించారు అంటూ నరేష్‌ చెప్పుకొచ్చాడు.

అందుకే తనను గెలిపించాల్సిందిగా కోరాడు.

నరేష్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలపై శివాజీ రాజా ప్యానల్‌ సభ్యుడు పృథ్వీ కౌంటర్‌ ఇచ్చాడు.

సభ్యుడిగా పృథ్వీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… శివాజీ మరియు శ్రీకాంత్‌లు మంచి వారు, వారిద్దరి గురించి నాకు చాలా కాలంగా తెలుసు.

అందుకే వారికి మద్దతుగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాను.శివాజీ గారిని విమర్శిస్తున్న నరేష్‌ కొంత కాలంగా జనరల్‌ సెక్రటరీగా ఉన్నాడు.

అధ్యక్ష పదవి కంటే అది చాలా పవర్‌ ఫుల్‌.మరి అప్పుడు ఏం చేయలేక పోయిన నరేష్‌ ఇప్పుడు ఛాన్స్‌ ఇవ్వమంటూ అడటం ఏంటీ అంటూ పృథ్వీ ఆరోపించాడు.

మా అమ్మగారు సాయం చేశారు, మా అమ్మ మా కోసం చాలా పని చేశారు అంటూ నరేష్‌ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు.మా సభ్యులు అంతా కూడా విజయ నిర్మల గారు మా కోసం ఎంతో సాయం చేశారు అని ఒప్పుకుంటాం.ఆమె ఇప్పుడు కాదు ఎప్పటి నుండో మా కోసం పాటు పడుతూ వస్తున్నారు.మరి మీరు ఏం చేశారు, మీర ఇప్పటి వరకు మా కోసం చేసిన సాయం ఏంటీ, నిర్వహించిన పనులు ఏంటో చెప్పండి.

మీ అమ్మగారిని చూసి ఓటు వేయమని అడగడం మీకు ఎలా అనిపిస్తుంది అంటూ పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.మొత్తానికి మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి.

రేపు జరుగబోతున్న ఎన్నికల్లో గెలుపు ఎవరో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube