ఐటీ గ్రిడ్స్ కేసులో ట్విస్ట్! హైకోర్ట్ ని ఆశ్రయించిన అశోక్!

హైదరాబాద్ కేంద్రంలో ఐటే గ్రిడ్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏపీలో ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని, ప్రభుత్వం కోసం తయారు చేసిన సేవామిత్ర, యాప్ ద్వారా వ్యక్తిగత డేటాని చోరీని ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది అని, అలాగే ఓట్ల తొలగింపు కుట్రకి శ్రీకారం చుట్టింది అని ఆరోపణలతో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసు విచారణ చేపడుతుంది.

 It Grids Md Ashok Files In High Court-TeluguStop.com

తాజాగా ఈ కేసులో మరో ముందడుగు వేసిన సిట్ బృందం ఐటీ గ్రిడ్ సంస్థని సీజ్ చేసారు.

ఇదిలా వుంటే ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ ప్రస్తుతం అజ్ఞాతంలో వున్నాడు.

ఇప్పటికే తెలంగాణ పోలీసులు అతని మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి, మరో వైపు మూడు బృందాలుగా మారి అశోక్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే అతను మాత్రం ఇప్పటి వరకు సిట్ కి దొరకలేదు.

కాకపోతే ఊహించని విధంగా ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించాడు.డేటా చోరీ కేసులో తన ప్రమేయం లేదని, ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని పిటీషన్ దాఖలు చేసాడు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు ఐటీ గ్రిడ్ కేసు సరికొత్త ట్విస్ట్ తీసుకుంది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube