టీడీపీ వైపు చూస్తున్న బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా ఫేంలోకి వచ్చిన నటుడు కౌశల్.కౌశల్ ఆర్మీ పేరుతో అధిక సంఖ్యలో ప్రజలు బిగ్ బాస్ లో కౌశల్ కి సపోర్ట్ గా ఓటింగ్ చేసి అతనిని గెలిపించడం జరిగింది.

 Big Boss 2 Winner Koushal Ready To Join Tdp-TeluguStop.com

తరువాత కూడా కౌశల్ ఆర్మీ పేరుతో అతను అసోషియేషన్ ఏర్పాటు చేసి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మొదలెట్టాడు.అయితే ఊహించని విధంగా కౌశల్ కి, కౌశల్ ఆర్మీలో కొంత మంది నుంచి వ్యతిరేకత మొదలైంది.

దానిని కాస్తా మీడియా చానల్స్ మరో సారి ఉపయోగించుకొని రచ్చ చేసాయి.

ఇదిలా వుంటే చాలా రోజులుగా కౌశల్ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇప్పుడు ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసి ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించాడు.అలాగే రానున్న ఎన్నికలలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తా అని మాట ఇచ్చాడు.

ఇతను మంత్రి గంటా శ్రీనివాసరావుతో వున్న సన్నిహిత సంబంధాలు ఉపయోగించుకొని టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది.మరి కౌశల్ చేరిక టీడీపీకి ఎంత వరకు లాభిస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube